భారత్-దక్షిణాఫ్రికా (IND Vs SA) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగించారు.సఫారీ జట్టు వికెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. దాంతో ఏకంగా 236 బంతుల తర్వాత టీమిండియాకు రెండో రోజు తొలి వికెట్ లభించింది. రెండో సెషన్లో స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కీలకమైన వికెట్ పడగొట్టి జట్టుకు ఊరటనిచ్చాడు.
Read Also: BCCI: దక్షిణాఫ్రికా ODI సీరీస్ కెప్టెన్ ఎవరు?

రిషభ్ పంత్ సేన తీవ్ర నిరాశ
రెండో రోజు తొలి సెషన్లో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) సేన తీవ్ర నిరాశకు గురైంది. అయితే, లంచ్ విరామం తర్వాత బౌలింగ్‌కు వచ్చిన జడేజా తన అద్భుతమైన బంతితో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ను బోల్తా కొట్టించాడు.
దాంతో హాఫ్ సెంచరీకి కేవలం 5 పరుగుల దూరంలో వెర్రెయిన్ (45) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 131 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. క్రీజులో సెనూరన్ ముత్తుసామి (84), మార్కో యాన్సెన్ (47) ఉన్నారు. అద్భుతంగా ఆడుతున్న ముత్తుసామి తన తొలి టెస్ట్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: