2025 యాషెస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో (Aus vs Eng) ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో సంచలన విజయం (Australia) నమోదు చేసింది. 205 రన్స్ టార్గెట్‌తో పెర్త్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో టార్గ్‌ట్‌ను అందుకున్నది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ శరవేగంగా సెంచరీ నమోదు చేశాడు.
Read Also: Aus vs Eng: యాషెస్ తొలి టెస్టులో చెత్త రికార్డు

రెండు రోజుల్లోనే కంప్లీట్!
69 బంతుల్లోనే సెంచరీ చేసిన హెడ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 83 బంతుల్లో 123 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. తొలి రోజు 19 వికెట్లు కూలిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఇంగ్లండ్ కేవలం 164 రన్స్‌కే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది.
యాషెస్ (Ashes) అంటే ఏమిటి?
యాషెస్ అనేది ఇంగ్లాండ్–ఆస్ట్రేలియా మధ్య జరిగే చారిత్రాత్మక టెస్ట్ సిరీస్. ఇది 1882లో ప్రారంభమైంది.
యాషెస్ సిరీస్ ఎన్ని మ్యాచ్‌లతో జరుగుతుంది?
సాధారణంగా యాషెస్ సిరీస్ 5 టెస్టు మ్యాచ్‌లతో జరుగుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: