రాశి ఫలాలు – 23 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మేష రాశి
సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకోవడం మీ రోజును మరింత సానుకూలంగా మారుస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులుమీరు అడిగే ముందే సహాయం అందించే పరిస్థితులు ఏర్పడతాయి.
వృషభరాశి
మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకోవడం మీ రోజుకు ప్రత్యేకమైన మార్పును తెస్తుంది. మీరు ఎదురుచూస్తున్న వార్తలు, అవకాశాలు లేదా ముఖ్యమైన సూచనలు స్నేహితుల ద్వారా లభించవచ్చు.
…ఇంకా చదవండి
మిథున రాశి
మాటల చాతుర్యం ఈరోజు మీకు అత్యంత బలమైన ఆయుధంగా మారుతుంది. మీరు చెప్పే ప్రతి మాటలో స్పష్టత, ఆకర్షణ, లాజిక్ ఉండడంతో ఇతరులు మీ మాటలను సులభంగా నమ్ముతారు.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
వృత్తి, వ్యాపారాలలో ఈరోజు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మీరు వాటిని అధిగమించే ధైర్యం, తెలివి చూపగలుగుతారు.. మొదట్లో పనులు నెమ్మదిగా సాగుతున్నట్లుగా అనిపించవచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలమవుతాయి.
…ఇంకా చదవండి
సింహ రాశి
పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో ఉన్న సింహరాశివారికి ఈరోజు కొంత అనుకూలత కనిపిస్తుంది. రోజుదొలిపి పని నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపించినా, మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీ వైపుకు మరింతగా తిరుగుతాయి.
…ఇంకా చదవండి
కన్యా రాశి
కొంతకాలంగా నిలిచిపోయిన లేదా స్తంభించిన కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి.చిన్న అడ్డంకులు మీ మార్గంలో కనిపించినా, మీ పద్ధతి, పరిశీలన, నిశిత శ్రద్ధతో వాటిని సులభంగా అధిగమిస్తారు.
…ఇంకా చదవండి
తులా రాశి
ఆర్థిక వ్యవహారాలలో తన–పర భేదం ఉండదన్న నిజాన్ని ఈరోజు మీరు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురైనా, మీరు తీసుకునే నిర్ణయాలు ఆచితూచి ఉండటం వల్ల నష్టాలు తప్పుతాయి.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
సహోదర–సహోదరీ వర్గానికి మీరు అందించే సహాయ–సహకారాలు ఈరోజు ప్రత్యేక గుర్తింపు తెస్తాయి. కుటుంబ సంబంధాలలో మీ పాత్ర మరింత బలపడుతుంది.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఈరోజు దీర్ఘాలోచనలు మీ మనస్సులో కొనసాగుతాయి. ఏ చిన్న విషయం అయినా మీరు లోతుగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తారు.
…ఇంకా చదవండి
మకర రాశి
కుటుంబంలో ఉన్న చిన్నపాటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే రోజు ఇది. మీ మాట్లాడే తీరు, మీ నిదానం,మీ ఆలోచన శైలి కుటుంబ సభ్యులను ఒకే దారి మీదకు తీసుకువస్తాయి.
…ఇంకా చదవండి
కుంభ రాశి
ఈరోజు మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ ముందొక మాట, మీ వెనుక మరో మాట చెబుతూ ద్వంద్వ స్వభావంతో ప్రవర్తించే అవకాశం ఉంది.వారి అస్పష్టత, నిజాయితీ లోపం మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు.
…ఇంకా చదవండి
మీన రాశి
ఋణ సంబంధిత యత్నాలు ఫలించే అవకాశం ఉంది. మీరు ఎదురుచూస్తున్న ఆమోదాలు, ఆర్థిక సహాయాలు అనుకున్నట్టుగానే సిద్ధమవుతాయి.
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)