हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: CP Sajjanar: సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరం: సీపీ సజ్జనార్

Anusha
Latest News: CP Sajjanar: సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరం: సీపీ సజ్జనార్

ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి

సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరం

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్

చార్మినార్ ప్రాంగణంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్,అన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరికి అప్రమత్తత అవసరమని ఆయన సూచించారు. హైదరాబాద్ చార్మినార్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ‘జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్’ సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar),ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Read Also: Gram Panchayat elections: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వ జీవో విడుదల

Vigilance is needed regarding cyber crimes: CP Sajjanar
Vigilance is needed regarding cyber crimes: CP Sajjanar

పోలీస్ అధికారులతో కలిసి చార్మినార్ పరిసరాల్లో సైబర్ క్రైం నివారణ కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం చార్మినార్ నుంచి మదీనా వరకు సైబర్ క్రైం అవగాహణ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సీపీ సజ్జనార్ (CP Sajjanar), మాట్లాడుతూ.. హైదరాబాద్ ను సైబర్ నేర రహితంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి మంగళ, శనివారాల్లో ‘జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్’ సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వారంలో ఈ రెండు రోజులు ప్రతి ఇంటికి పోలీస్ అధికారులు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని ఆయన వివరించారు. అవగాహన లేమితోనే అనేక మంది సైబర్ నేరాల బాధితులవుతున్నారని అన్నారు. ఏ రకమైన సైబర్ (Cyber) మోసం అయినా, వాటికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు స్వీయ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.

ఆడ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి

సైబర్ నేరాల నివారణకు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని, స్వచ్చందంగా వలంటీర్లుగా ముందుకు వచ్చే వారు సైబర్ సింబాలుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక సైబర్ సింబా తయారై తన కుటుంబాన్ని, సమాజాన్ని సైబర్ మోసాల నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు.ప్రైవేట్ ఫోటోలు, వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దని, అలా చేస్తే ట్రాప్ చేసి మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని, ముఖ్యంగా ఆడపిల్లలు అజ్ఞాత వ్యక్తులతో చాటింగ్ చేసి వ్యక్తిగత వివరాలు సమర్పించుకొని బాధితులు అవుతున్నారని చెప్పారు. ఆడ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారికి ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుంటున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాల పట్ల వారి పిల్లలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.

సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ చాలా కీలకం

ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్ప్ లైన్ నంబర్ 1930 కి చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే, జాతీయ సైబర్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ చాలా కీలకమని, మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టవచ్చని స్పష్టం చేశారు.

అనుమానాస్పద కాల్స్, లింక్స్, యాప్ లను నమ్మవద్దని, ఓటీపీలు, పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. ఈ కార్యక్రమములో అడిషినల్ సిపి క్రైం ఆండ్ సిట్ శ్రీ.యం.శ్రీనివాస్ ఐపిఎస్, సౌత్ జోన్ అడిషినల్ డిసిపి శ్రీ.యం. మాజిద్, సౌత్ జోన్ ఏసీపీలు పి.చంద్రశేఖర్, సీహెచ్.చంద్రశేఖర్, జి.శ్యామ్ సుందర్, ఎంఏ జావీద్, తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సైబర్ క్రైమ్‌కు ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

1930 – National Cyber Helpline (or) అధికారిక పోర్టల్- www.cybercrime.gov.in – (or) దగ్గరలోని సైబర్ క్రైమ్ police station

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870