ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ (Aus vs Eng) మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఆట ముగిసేసరికి ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 123-9 స్కోర్‌తో నిలిచింది. ప్రస్తుతం ఆసీస్ 49 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో బ్రెండన్ (0), నాథన్ లియాన్ (3) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లతో సత్తా చాటగా, జోఫ్రా ఆర్చర్, బ్రెండన్ కార్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
Read Also: IND vs SA 2nd Test: రెండో టెస్టు.. టాస్ ఓడిన టీమిండియా

తొలి రోజు అత్యధిక వికెట్లు కోల్పోయిన మ్యాచ్‌గా పెర్త్ టెస్టు
బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ను మిచెల్ స్టార్క్ తీవ్రంగా దెబ్బకొట్టాడు. అతడి దెబ్బకు ఇంగ్లాండ్ 32.5 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హ్యారీ బ్రూక్ (52) టాప్ స్కోరర్. స్టార్క్ మొత్తం 7 వికెట్లతో ఆదరహో అనిపించాడు. బ్రెండన్ 2, గ్రీన్ 1 వికెట్ దక్కించుకున్నారు.తొలి ఓవర్ ఆరో బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఇక 32.5 ఓవర్లలో 172 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కూడా సున్నాకే మొదటి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డెబ్యూ ఆటగాడు జేక్ వెదర్లాడ్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఇరుజట్లలోని ఓపెనర్లు సున్నాకే పెవిలియన్ చేరడం 143 ఏళ్ల యాషెస్ చరిత్రలో ఇదే తొలిసారి అయ్యింది.
కాగా, ఈ మ్యాచ్ తొలి రోజు రెండు జట్లు కలిపి 19 వికెట్లు కోల్పోయాయి. తొలుత ఇంగ్లాండ్ ఆలౌట్ కాగా, అనంతరం ఆసీస్ 9 వికెట్లు పడ్డాయి. అయితే యాషెస్ చరిత్రలో గత 100ఏళ్లలో తొలి రోజు అత్యధిక వికెట్లు కోల్పోయిన మ్యాచ్‌గా పెర్త్ టెస్టు నిలిచింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: