Puttaparthi : భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలలో భాగంగా శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్ర పతి రాధాకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యశాఖ, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి నారాలోకేష్లు పుట్టపర్తి రానున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. అధికారులు అందించిన మేరకు వారి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 09:45 గంటలకు పుట్టపర్తి శ్రీసత్యసాయి విమానా శ్రయంకు చేరుకోనున్నారు. ఆయన ఉదయం 10:30 నుండి 10:40 గంటలకు విమానాశ్రయంలోనే. వేచిఉండి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతంపలకి అటు పిమ్మట ఉదయం 11:00 గంటలకు శ్రీసత్యసాయి ప్రశాంతినిలయం చేరుకొని భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని ప్రత్యేకంగా దర్శించుకోని శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.
Read Also: AP: ఆసుపత్రులో కొత్తగా 15 న్యూట్రిషన్ కేంద్రాలు

ప్రశాంతి నిలయంలో జరగనున్న భగవాన్ సత్యసాయి బాబా
అనంతరం 12:10 గంటలకు రాష్ట్రపతితో కలసి సత్యసాయి విమానాశ్రయం చేరుకొని రాష్ట్రపతికి వీడ్కోలు పలకడం జరుగుతుందన్నారు. అనంతరం 12:30గంటల నుండి మధ్యాహ్నం 03:30గంటల వరకు విశ్రాంతి తీసుకొని 03:40 గంటలకు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణకు స్వాగతంపలికి ప్రశాంతి నిలయంలో జరగనున్న భగవాన్ సత్యసాయి బాబా యూనివర్శిటీ 44వ స్నాతకోత్సవంలో పాల్గొంటున్నట్లు అనంతరం రాత్రికి ప్రశాంతి తెలియజేశారు. నిలయంలో విశ్రాంతి తీసుకొని ఆదివారం ఉదయం 09:00గంటలకు శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే భగవాన్ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవ వేడుకలలో పాల్గొంటారని, ఉత్సవాల అనంతరం ఉదయం 11:20 గంటలకు శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకొని 11:30 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నట్లు తెలియజేశారు.
ముఖ్యమంత్రులతో కలసి పై కార్యక్రమాల్లో
అంతకు మునుపు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల శాఖ మంత్రి నారాలోకేష్ శనివారం ఉదయం 08:15 గంటలకు ప్రత్యేక విమానంలో శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకోనున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రులతో కలసి పై కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలి పారు. నారా లోకేష్ 22వ తేదీ సాయంత్రం 06:20 గంటలకు కప్పల బండ వద్ద ఉన్న ఎపిఐఐసి లేఔట్ నందు బస చేయనున్నట్లు తెలియజేశారు. అనంరతం 23వ తేదిన ఉదయం ఆయన 9:00 గంటలకు హిల్వ్యూ స్టేడియంలో జరిగే భగవాన్ సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొంటారన్నారు. అనంతరం 11:40 గంటలకు పాలసముద్రం వద్దగల నాసిన్ కేంద్రాన్ని సం దర్శించి అక్కడ జరిగే కార్యక్రమంలో 12:30 గంటల వరకు పాల్గొంటారని, అటు పిమ్మట అక్కడి నుండి బయలుదేరి 1:10 గంటలకు శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకొని 1:50 గంటలకు ప్రత్యేకవిమానంలో తిరుగు ప్రయా ణం కానున్నట్లు అధికారులు తెలియజేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: