ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంతో కొత్త పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని విద్యార్థినుల ఉన్నత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు ‘కలలకు రెక్కలు’ పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశ–విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే యువతులకు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
Read Also: VY Case: పులివెందుల మాజీ సీఐ తొలగింపు—కేసులో కొత్త ట్విస్ట్

విద్యార్థినుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం
దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని (Minister Lokesh) ట్వీట్ చేశారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది తమ కలలను అర్థాంతరంగా వదిలిపెట్టాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ‘కలలకు రెక్కలు’ పథకం వారికి గొప్ప అవకాశం..
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: