Raju Weds Rambai Movie Review : స్టార్ కాస్ట్ అఖిల్ రాజ్ ఉద్దెమారి, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి
దర్శకుడు: సాయిలు కాంపాటి
నిర్మాతలు: వేణు ఉడుగుల, రాహుల్ మొపిదేవి
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిడివి: 2 గంటలు 15 నిమిషాలు
విడుదల: నవంబర్ 21, 2025
గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ప్రేమకథలు ఇప్పటికే మనకు ఎన్నో ఉన్నాయి. వాటిలాగే కనిపిస్తున్నా, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన చిత్రం ‘Raju Weds Rambai’. అఖిల్ రాజ్ – తేజస్వి రావు జంటగా నటించిన ఈ సినిమాకు సాయిలు కాంపాటి దర్శకత్వం వహించారు.
కథ
రాజు (అఖిల్ రాజ్) గ్రామంలో బ్యాండ్ బాయ్. ఏ సందర్భం వచ్చినా అతడే శబ్దం, అతడే సందడి. చిన్నప్పటి నుంచే రాంబాయి (తేజస్వి రావు)ని ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రాజు బ్యాండ్ వాయించినప్పుడు మురిసిపోతూ, క్రమంగా అతన్ని మనసులోకి దించుకుంటుంది.
కానీ వారి ప్రేమకు పెద్ద అడ్డంకి రాంబాయి తండ్రి వెంకన్న (చైతు జొన్నలగడ్డ). ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేసే వెంకన్న కఠినమనిషి. తన కూతుర్ని రాజుతో పెళ్లి చేయడానికి ఒప్పుకోడు.
ఈ ప్రేమజంట కలిసి నిలబడేందుకు ఎలాంటి అడ్డంకులు దాటారు? వారి ప్రేమను ఎలా కాపాడుకున్నారు? ఇది కథా సారాంశం.
Latest News: India 5G: 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
నటనా ప్రదర్శనలు
తేజస్వి రావు ఈ చిత్రానికి హృదయం. మేకప్ లేకుండా, పూర్తిగా సహజమైన గ్రామీణ అమ్మాయిలా కనిపించి రాంబాయి పాత్రలో ప్రాణం పోశింది. (Raju Weds Rambai Movie Review) క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతం.
అఖిల్ రాజ్ రాజుగా బాగా చక్కబడ్డాడు. ప్రేమలో మునిగిపోయిన యువకుడిగా బాగానే నటించాడు. కోపం, బాధ సన్నివేశాల్లో ఇంకాస్త మెరుగుపడాల్సి ఉన్నా, రాంబాయితో కెమిస్ట్రీ బాగుంది.
చైతు జొన్నలగడ్డ ఈ సినిమాకి మరో పెద్ద ఆస్తి. అహంకారం, కాలు దెబ్బతినడం వల్ల ఉన్న అసహనం, కుటుంబం మీద ప్రేమ—మూడు కూడా అద్భుతంగా చూపించాడు.
శివాజీ రాజా, అనిత చౌదరి, ఇతర నటీనటులు కూడా తమ పాత్రలలో నెరవేరారు.
టెక్నికల్ అంశాలు
- కథ పాత పంథాలోనే ఉన్నా, చివరి 20 నిమిషాలు మాత్రం భారీ ట్విస్ట్‌తో షాక్ ఇస్తాయి.
- స్క్రీన్‌ప్లే సాదారణ గ్రామీణ ప్రేమకథలా ముందే అంచనా వేసేలా ఉంటుంది.
- దర్శకుడు సాయిలు కాంపాటి కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో పట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా పెద్ద నిర్ణయం తీసుకున్న తరువాత వచ్చే సన్నివేశాలు త్వరగా ముగిసినట్టు అనిపిస్తాయి.
- సురేష్ బొబ్బిలి సంగీతం మంచిదే. ముఖ్యంగా “రాంబాయి నీమీద నాకూ…” పాట సినిమాకు మంచి పాయింట్. హాఫ్‌లో రెండు అప్రయోజకమైన సాడ్ బిట్స్ తగ్గిస్తే ఇంకా బాగుండేది.
- వాజిద్ బైగ్ సినిమాటోగ్రఫీ గ్రామీణ అందాలను అద్భుతంగా పట్టాడు.
- ఎడిటింగ్ రెండో భాగంలో కొంచెం మందగించింది.
- ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా కనిపిస్తాయి.
ఎక్కడ బాగుంది?
తేజస్వి రావు అద్భుత నటన
చైతు జొన్నలగడ్డ మనసును తాకే పెర్ఫార్మెన్స్
అఖిల్ రాజ్ & తేజస్వి కెమిస్ట్రీ
చివరి 20 నిమిషాల భావోద్వేగ క్లైమాక్స్
రాంబాయి పాట, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
అందమైన గ్రామీణ విజువల్స్
రేటింగ్: 2.75/5
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :