हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : youth: యువతకు ఆత్మస్థైర్యమే ఆయుధం

Sudha
Latest Telugu News : youth: యువతకు ఆత్మస్థైర్యమే ఆయుధం

నేడు యువత మేధస్సులో పదును తగ్గింది, ఆలోచనలో లోతు తగ్గిపోయింది. ఆవేశంలో వేగం పెరిగింది. కానీ వెళ్లాల్సిన గమ్యం ఏది అనేదే తెలియకుండానే పరు గెడుతున్నారు. జీవితాన్ని సార్థకం చేసుకునే వయస్సులో, తప్పటడుగులతో జీవితాన్ని నాశనం చేసే నిర్ణయాలు తీసు కుంటున్నారు. ఆధునిక పోకడలు అధికమయ్యాయి. విలు వలు, బాధ్యతలను వదిలేసేస్తున్నారు. సంతోషం, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ అనే పేర్లతో నా జీవితం నా ఇష్టం అనే క్షణికానందంతో జీవితాలను అతలాకుతలం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితానికి ఇవ్వాల్సిన విలువ, పెద్దలకు, సమా జానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేక సర్వస్వం కోల్పోతున్నారు. సామజిక స్పృహ, ధైర్యం లేని చోట, అవకాశాలు కనిపించవు. ఆత్మస్థైర్యం వదిలేసినప్పుడు, ప్రతి సమస్య పెద్ద కొండలా అనిపించేలా ఉంటుంది. భయంతో, అయో మయంతో, ఒక్క తప్పు అడుగు జీవితాన్ని తప్పు దిశలో నడిపేస్తోంది. విద్యార్థి దశ అభివృద్ధి కాలం, అభివృద్ధికి అన్వేషణ సమయం, జీవితానికి పునాది వేసే వయస్సు. కానీ ఈ దశలోనే యువత (youth). దిశ మార్చి, దారితప్పి, తమలో ఉన్న అద్భుతమైన శక్తిని మరచిపోతున్నారు. వాళ్లలో కొరత ప్రతిభలో కాదు, ధైర్యాన్ని నిలబెట్టే మనసులోవారికి లోపం బుద్ధిలో కాదు. యువత (youth)ఇప్పటికైనా గ్రహించాలి. జీవితం ఒక్క రోజులో సార్థకం కాదు. కానీ తీసుకునేఒక్క నిర్ణ యం మాత్రం జీవితాన్ని మార్చిపెట్టగలదు. మనస్సులో పదును పెరిగితేనే, జీవితంలో వెలుగు పుడుతుంది. జీవి తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చుట్టూ సమాజంలో కనిపించేవాటిలో ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు, అనేక సంఘటనల నుంచి గ్రహించవచ్చు.

Read Also: AP: మత్స్యకారుల ఆర్థిక భృతి రూ.20వేలకు పెంపు

youth
youth

విజయం సాధించిన ఎందరో మీ ముందు కనిపిస్తున్నారు, మీకు తెలియని వాళ్ళ జీవితాలకన్నా, మీకు కనిపిస్తున్న వాళ్ళ జీవితాలను గ్రహిం చండి. చిన్నస్థాయి ఉద్యోగం నుంచి అత్యున్నతమైన స్థాయి కి చేరుకునేవాళ్ళు, వీధిలో వ్యాపారం నుంచి విదేశాలలోఎగుమతులు చేసే స్థాయికి వచ్చినవాళ్లు, రీసెంట్గా చిన్న వయస్సులోనే శాసనసభ్యురాలిగా ఎన్నికైన మైథిలీ ఠాకూర్ ఇలా ఇందరో ఉన్నారు. వ్యాపారాలలో విజయపరంపర సాగిస్తున్న వ్యాపార వేత్తలు, ఇంకా ముఖ్యంగా ఐఏఎస్, ఐపీస్ లు ఇలా ఎందరో మీ చుట్టే ఉన్నారు. వాళ్ళ జీవితా లను పరిశీలించండి, ఎన్ని ఒదిగుడుకులు ఎదుర్కొని సాధిం చారో అర్థం అవుతుంది. విజయం సాదించినవాళ్లు మొదటి ప్రయత్నంలోనే గెలుపు సాధించలేదు. లక్ష్యాన్ని ఏర్పరచు కొని అహర్నిశలు కష్టపడ్డారు. ఆకలి బాధలను ఓర్చుకున్నారు. కన్నీళ్లను దిగమింగుకున్నారు. ఓడిపోయినా పట్టు విడువ లేదు, లక్ష్యాన్ని సాధించేవరకు యుద్ధమే చేసారు. జీవిత ఆశయాన్ని నిలబెట్టుకున్నారు. జీవితాన్ని సార్ధం చేసుకోవ డం ఒక కల, ఆకలను సాధిస్తే మీరే ఎందరికో మార్గదర్శ కులు అవుతారు. జీవితం ఎడారి, రహదారిని నిర్మించుకో వలసింది మీరే, తప్పటడుగు వేస్తె జీవితం అగాధంలోకే వెళ్తుంది, మనిషి బానిసగా మార్చే వ్యసనాల ను దరి చేర నీయకపోతే మీరు రహదారిలోనే వెళ్తునట్టే. ఎవ్వరో వచ్చి మేల్కొల్పరు. మీ జ్ఞానమే మీకు మేలుకొలుపు అవ్వాలి. జీవితం అత్యంత విలువైనది. కోల్పోవడం క్షణమే, కానీ నిలుపుకోవడం సాధించుకోవడం సాగిపోవడం జీవి తాన్ని సార్ధం చేసుకోవడమే. మనస్సును సానుకూలమైన వాటి పట్ల కేంద్రీకరిస్తే శక్తివంతంగా మారుతుంది. మీ దశ మార్చే వెలుగు రేఖ అవుతుంది. మీ దిశనే మార్చేస్తుంది. ఆలోచన ఓ విత్తనం, ఆచరణే దానికి జీవం. సాధిస్తే మహా వృక్షమే అవుతుంది, కావలసింది మీలోదృఢమైన సంకల్పం. ఆత్మస్థైర్యమే ఆయుధంగా మారాలి. దృఢమైన ఆచరణ కొనసాగిస్తే మీరే విజేత.
– డాక్టర్. వై. సంజీవ కుమార్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870