కర్ణాటక లో సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగించి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) కు ఆ పదవిని కట్టబెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తాజాగా పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో డిన్నర్‌లో పాల్గొనడం ఈ ఊహాగానాలకు తెరతీసింది. అయితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar)ఈ డ్రామాకు తెరదించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యేనని చెప్పారు. పూర్తికాలం ఆయనే సీఎంగా కొనసాగుతారని చెప్పారు. తామంతా ఆయనతో కలిసి పని చేస్తామని అన్నారు. ఖర్గేతో ఎమ్మెల్యేల సమావేశం గురించి ప్రశ్నించగా.. వాళ్లు పీసీసీ అధ్యక్ష పదవి, నాలుగైదు డిప్యూటీ సీఎం పదవులను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
Read Also : http://Prashant Kishore: నా ఆస్తులన్నీ పార్టీకి ఇచ్చేస్తా

ఇలాంటి మీటింగ్‌లు గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నాయని డీకే చెప్పారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదని అన్నారు. వాళ్లు ఇలాంటి మీటింగ్‌లు ఇంకా మరిన్ని పెట్టుకోనీయని వ్యాఖ్యానించారు.
డీకే శివకుమార్ మంత్రి ఎవరు?
శివకుమార్. దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ (జననం 15 మే 1962) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు వ్యాపారవేత్త, అతను 2023 నుండి కర్ణాటక ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి.
డికె శివకుమార్ కళాశాల పేరు ఏమిటి?
గ్లోబల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బెంగళూరు అనేది నేషనల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌లో ఒక భాగం, ఇది శ్రీ డికె శివకుమార్ స్థాపించిన ట్రస్ట్, ఇది తాజా నాణ్యమైన నర్సింగ్ విద్యా సమాజాన్ని అందించడానికి. ఇది నర్సింగ్ సేవల రంగంలో మంచి నాణ్యమైన వనరుల సమూహాన్ని సృష్టించడంలో కూడా సహాయపడుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: