బిల్లులను క్లియర్ చేసేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధించలేమని సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్(CM MK Stalin) స్పందించారు. బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని ఆయన అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు విశ్రమించలేది లేదని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ముర్ము అడిగిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు చేసిన సూచనలపై సీఎం స్టాలిన్ (CM MK Stalin)రియాక్ట్ అవుతూ.. రాష్ట్ర హక్కుల కోసం పోరాడనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర హక్కులు, నిజమైన ఫెడరల్ స్పూర్తి కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రం, గవర్నర్ మధ్య జరిగిన కేసులో ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన తీర్పుపై ప్రభావం ఉండదన్నారు.
Read Also : http://Delhi Air pollution: తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది. నిర్ణీత కాల వ్యవధిలో గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోకపోతే, ఆటోమెటిక్‌గా వాటికి ఆమోదం లభిస్తుందనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు గుర్తు చేసింది. అలాంటి సంప్రదాయాన్ని తాము తీసుకురాబోమని వెల్లడించింది. కానీ, కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్‌లో ఉంచితే, కోర్టులు పరిమితంగా జోక్యం చేసుకోవచ్చని వివరించింది. ఈ మేరకు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన 14 ప్రశ్నలకు (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌తో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమగ్రంగా సమాధానమిచ్చింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper :epapervaartha.com
Read Also: