మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చేసిన ఆరోపణలు కొత్త మలుపు తిప్పాయి. ఈ ఘటన అసలు ఎదురుకాల్పులు కాదని, పోలీసులే తమ నాయకులను ముందుగా అదుపులోకి తీసుకుని తర్వాత అడవిలో హతమార్చి ఎన్‌కౌంటర్‌గా చూపించారని లేఖలో పేర్కొన్నారు. కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, (HIdma) ఆయన సహచరి రాజే మరియు కొంతమంది వైద్య చికిత్స కోసం విజయవాడకు వెళ్లిన సమయంలోనే ఈ మొత్తం పరిణామం జరిగిందని తెలిపారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో కొందరి ఇచ్చిన సమాచారం ఆధారంగా నవంబర్ 15న ఎస్‌ఐబీ పోలీసులు హిడ్మా, రాజేలను అదుపులోకి తీసుకున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు.
Read also: Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురిని అరెస్టు చేసిన ఎన్ ఐఎ

Hidma: Maoist party letter on Hidma encounter
ఈ సంఘటనలను ఖండిస్తూ నవంబర్ 23న
వారిని లొంగిపోవాలని ఒత్తిడి చేసినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో, తర్వాత హత్య చేసి మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌గా ఘటనను రూపొందించారని ఆరోపించారు. రంపచోడవరంలో ఏవోబీ రాష్ట్ర కార్యదర్శి శంకర్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మరణించాడని లేఖలో పేర్కొన్నారు. ఈ సంఘటనలను ఖండిస్తూ నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన తెలిపేందుకు పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వమే ఈ చర్యలకు ప్రోత్సాహం ఇస్తుందని విమర్శించారు. హిడ్మా, రాజే, శంకర్ వంటి నాయకుల త్యాగాలకు విప్లవ జోహార్లు అర్పిస్తూ, వారి స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగిస్తామని పార్టీ ప్రకటించింది. మొత్తం మీద ఈ లేఖ పోలీసుల వెర్షన్‌కు పూర్తిగా భిన్నమైన వాదనను ముందుకు తెచ్చింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :