వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, (RGV) ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని మద్దతుగా నిలిచారు. ఆయన అభిప్రాయం ప్రకారం, దేవుడిని నమ్మకపోవడం కూడా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజమౌళి పై విమర్శల వెనుక అసలు కారణం అసూయ మాత్రమే అని వర్మ తెలిపారు. తాజాగా ‘వారణాసి’ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి తెలిపారు ఆయనకు దేవుడిపై ప్రత్యేక నమ్మకం లేదని. ఇది వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు రాజమౌళి నాస్తికుడిగా ఉండడం నేరం కాదు. ఆర్టికల్ 25 ప్రకారం నమ్మకపోవడానికీ హక్కు ఉంది.
Read also: కాప్30 సదస్సులో అగ్ని ప్రమాదం..

నాస్తికత్వం సమస్య కాదు, అసూయే విమర్శల వెనుక కారణం
వర్మ దేవుడిని(RGV) నమ్మకపోతే ఆయనపై సినిమాలు ఎందుకు తీస్తున్నారు అనే వాదన సరైనది కాదు. గ్యాంగ్‌స్టర్ సినిమా తీస్తే దర్శకుడు గ్యాంగ్‌స్టర్ కావాలా? లేదా దెయ్యం సినిమా తీస్తే దర్శకుడు దెయ్యం కావాలా అని ప్రశ్నించారు. ఆయన దేవుడే రాజమౌళి(S.S. Rajamouli) విజయానికి సంపదకు కారణమని స్పష్టంచేశారు. అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదని పూజలు చేసినా ఫలితం పొందలేకపోయిన వారి అసూయ మాత్రమే విమర్శలకు కారణమని వర్మ అభిప్రాయపడ్డారు. ‘వారణాసి’ సినిమా ద్వారా రాజమౌళి సంపత్తిని పెంచుకుంటారని విమర్శకులు అసూయతో ఏడవవచ్చని పేర్కొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :