గత 50 సంవత్సరాల్లో బ్రిటన్ వలస విధానంలో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కీర్ స్టార్మర్(Keir Starmer) నేతృత్వంలోని బ్రిటన్(Britain) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, చట్టపరమైన వలసదారులు కూడా దేశంలో శాశ్వతంగా స్థిరపడటానికి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. సాధారణ వలసదారులు 20 సంవత్సరాల వరకు కూడా వేచివుండాల్సి ఉండవచ్చు.
హోం సెక్రటరీ షబానా మహమూద్ వివరించిన విధంగా, కొత్త విధానం దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి తోడ్పడే వారికి ప్రాధాన్యతనిస్తుంది. తక్కువ ఆర్థిక సామర్థ్యం గల వలసదారులు, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే వారు ఎక్కువ కాలం వేచివుండాల్సి ఉంటుంది, కానీ NHS లో పనిచేసే డాక్టర్లు, నర్సులు 5 సంవత్సరాల్లో సెటిల్‌మెంట్ పొందగలుగుతారు. అత్యధిక వేతనం పొందేవారికి, పారిశ్రామిక వేత్తలకు 3 సంవత్సరాల్లో సెటిల్‌మెంట్ సాధ్యం.
Read also: తెలంగాణలో స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్

భారతీయ వలసదారులపై ప్రభావం
ఈ కొత్త విధానం 2021 నుండి యూకేకు(Keir Starmer) వచ్చిన దాదాపు 20 లక్షల వలసదారులపై ప్రభావం చూపుతుంది. ఇందులో భారతీయ వలసదారుల సంఖ్య గణనీయంగా ఉంది. ఇప్పటికే సెటిల్‌మెంట్ పొందినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ప్రభుత్వం 12 వారాల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
మరో కీలక మార్పు ఏమిటంటే, వలసదారులు ప్రభుత్వ సౌకర్యాలు, సామాజిక వసతి వంటివి సెటిల్‌మెంట్ పొందిన వెంటనే కాకుండా, బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాతే పొందగలుగుతారు. హోం సెక్రటరీ ప్రకారం బ్రిటన్‌లో స్థిరపడటం హక్కు కాదు అది సంపాదించుకోవాల్సిన అదృష్టం అని తెలిపారు. ఈ మార్పులు బ్రిటన్ సెటిల్‌మెంట్ విధానాన్ని ఐరోపాలో అత్యంత కఠినమైనదిగా మార్చనున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :