పేద, పీడిత వర్గాల కోసం దశాబ్దాలుగా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసిన మావోయిస్టు పార్టీ(Maoists) ప్రస్తుతం తన అత్యంత బలహీన దశలో ఉంది. వరుస ఎన్‌కౌంటర్లు, భారీ స్థాయి లొంగుబాట్లు కారణంగా పార్టీ నిర్మాణం పూర్తిగా కుప్పకూలిపోతోంది. కేంద్ర కమిటీ దాదాపు పేరు మాత్రంగా మిగిలింది. తాజాగా పార్టీ ప్రధాన నేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిలను పోలీసులు రహస్య ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం బయటకు వచ్చింది. ఈ విషయంపై విశాఖలో అరెస్టైన మావోయిస్టుల ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కీలక నేతలను పట్టుకున్నారని తెలుస్తోంది.
Read Also: Moinabad: చేవెళ్ల హైవేపై యాక్సిడెంట్.. కలచివేస్తున్న దృశ్యాలు

హైకోర్టు తలుపుతట్టిన పౌరహక్కుల సంఘాలు
తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో నవంబర్ 18న పోలీసులు ఈ ఇద్దరు అగ్రనేతలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేసే అవకాశముందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరగనుంది. దండకారణ్యంలో భద్రతా బలగాలు విస్తృత ఆపరేషన్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఇటీవలే మావోయిస్టు(Maoists) అగ్రనేత హిడ్మా, అతని భార్య సహా ఆరుగురు లీడర్లు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
చత్తీస్‌గఢ్‌లో ఒత్తిడి పెరగడంతో ఆంధ్ర–ఒడిశా మార్గంగా కదిలిన సమయంలో మారేడుమిల్లి అటవీలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
మావోయిస్టులపై భారీ ఆపరేషన్‌కు కేంద్రం సిద్ధం
ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న ఆల్ ఇండియా డీజీపీ సమావేశం నేపథ్యంలో, దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం భారీ ఆపరేషన్ ‘కగార్’ను వేగవంతం చేస్తోంది. అడవులన్నీ భద్రతా బలగాల చేత శోధన చర్యలతో కమ్ముకుని ఉన్నాయి.
అగ్రనేతల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ
ఈ ఇద్దరు ప్రముఖ నేతలు నిజంగా పోలీసుల అదుపులో ఉన్నారా?
ఉంటే –
- అరెస్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారా?
- లేక మళ్లీ ఎన్‌కౌంటర్ కథనాలతో బయటకు వస్తారా?
అనే ప్రశ్నలపై దేశవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు అప్రమత్తమవుతున్నాయి. మిగిలిన నేతలైనా ప్రాణాలతో నిలవాలని కోరుతూ కోర్టు ఆశ్రయం తీసుకుంటున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: