iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదించి, అతన్ని బయటకు తీసుకువస్తానంటూ సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. దీనిపై రవి కుటుంబ సభ్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో నివసిస్తున్న రవి తండ్రి ఇమ్మడి అప్పారావును సలీమ్ కలిసి కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఏ పేపర్లు, ఎందుకో వివరించకపోవడంతో అప్పారావు అనుమానంతో నిరాకరించినట్లు తెలిపారు.
Read Also:Egg prices: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

“ఆరోగ్యం సహకరించదు… కోర్టుల చుట్టూ తిరగలేను”
తన శారీరక పరిస్థితి బాగాలేకపోవడంతో కోర్టులకు వెళ్ళడం, న్యాయపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సాధ్యం కాదని అప్పారావు స్పష్టం చేశారు. ఇప్పటికే కేసుతో(iBOMMA) కుటుంబంపై ఒత్తిడి పెరిగిందని, ఇలాంటి అనుమానాస్పద ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉన్నామని అన్నారు. రవి కేసు చుట్టూ జరుగుతున్న పరిణామాలు కుటుంబాన్ని మరింత ఆందోళనలోకి నెట్టుతున్నాయి. అనుమానాస్పదంగా వ్యవహరించే వ్యక్తులపై పోలీసులు కూడా నిఘా పెంచినట్లు సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: