మతం ఏదైనా అందరినీ ప్రేమించమనే చెబుతుంది. ఇతరులను ప్రేమించలేనిది అసలు అది మతమే కాదు. ఆ దేవుడు దేవుడే కాదు. కానీ మతం పేరుతో మారణహోమానికి పాల్పడుతున్న టెర్రరిస్టులు కరుడుగట్టిన భావజాలంతో ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఢిల్లీ (Delhi Blast) ఎర్రకోట కార్ బాంబ్ పేలుడుకు కారణమైన ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ గురించి విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Read Also: TG: తెలుగులో మాట్లాడాలని కలెక్టర్‌కు సూచించిన రేవంత్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ లోని (Jammu and Kashmir) అనంత్ నాగ్ మెడికల్ కాలేజీ (జీఎంసీ)లో పనిచేస్తున్నప్పుడు అతడి విపరీత ప్రవర్తనను గురించి సిబ్బంది గుర్తు చేసుకున్నారు. అతను వైద్య కోసం వచ్చిన మహిళా రోగులతో ప్రవర్తించిన తీరు గురించి చెబుతున్నారు. ఆత్మహుతి బాంబర్ గా మారిన ఉమర్, ఢిల్లీ ఉగ్రదాడితో 13మందిని బలి తీసుకున్నాడు.
హిజాబ్, నమూజ్ పై ప్రశ్నలు వేసే వైద్యుడు
డాక్టర్ ఉమర్ నబీ (Umar Nabi) మహిళా రోగులతో విపరీతంగా ప్రవర్తించేవాడని బాధిత మహిళలు చెబుతున్నారు. హిజాబ్ ధరించకపోవడంపై ప్రశ్నించే వాడని అక్కడ ఉన్న వారు చెబుతున్నారు. మహిళా రోగులతో అతడు మాట్లాడుతున్నప్పుడు ‘మీరు హిజాబ్ ఎందుకు ధరించలేదు? మీ తలను ఎందుకు సరిగ్గాకప్పుకోలేదు’ అని అడగటం విన్నామని అక్కడ పనిచేస్తున్న వారు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవేకాకుండా రోజుకు ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు అని ప్రశ్నించేవాడని, మత విశ్వాసాలను పట్టించుకోకపోతే వారిని శత్రువులుగా చూసేవాడని తెలుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: