ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చూపిస్తోంది.భారత్ సీనియర్ల జట్టుతో సహా జూనియర్ల జట్టు కూడా పలు విజయాలతో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ (Asia Cup Rising Stars 2025 Tournament) జరుగుతోంది.ఈ టోర్నీలో భారత్-ఏ జట్టు అదరగొడుతోంది. పలు మ్యాచ్‌లలో గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకుంది.
Read Also: Robin Uthappa: ఐపీఎల్ వేలం రద్దు చేయాలంటూ రాబిన్ ఊతప్ప విజ్ఞప్తి
UAE, ఒమన్‌లపై విజయాల తర్వాత టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరుకోగా.. హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్ A జట్లపై విజయాల తర్వాత బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇక టోర్నమెంట్లో మొత్తం నాలుగు సెమీఫైనలిస్టులుండగా.. అందులో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌ల వివరాలు వెల్లడయ్యాయి.
ఇందులో భాగంగా తొలి సెమీఫైనల్లో ఇండియా A జట్టు, బంగ్లాదేశ్ A (IND Vs BAN) జట్టుతో తలపడనుంది. ఈ సెమీఫైనల్ మ్యాచ్ నవంబర్ 21న మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (West End Park International Cricket Stadium) లో జరగనుంది. బలమైన ప్రదర్శనతో ఫైనల్లో తమ స్థానాన్ని భద్రపరచుకోవాలని రెండు జట్లు చూస్తున్నాయి.
ఎ జట్టు జితేష్ శర్మ కెప్టెన్సీ
టీమిండియా ఎ జట్టు జితేష్ శర్మ కెప్టెన్సీలో సెమీఫైనల్స్ కు సన్నద్ధమవుతోంది. ఈ సెమీఫైనల్స్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) నుంచి క్రికెట్ ఫ్యాన్స్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. అలాగే కెప్టెన్ జితేష్, నమన్ ధీర్ తన ఫామ్ ను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు.
హర్ష్ దుబే కూడా మరోసారి ఆల్ రౌండర్ గా అద్భుతమైన ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో గుర్జ్ పనీత్ సింగ్, సుయాష్ శర్మలు కూడా మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: