టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో(Delhi blast) ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధిఖీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే 13 రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఆయనపై తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రూ.2 కోట్ల మోసం కేసు నమోదైంది. దీంతో ఆయన అక్రమాల చిట్టా మరింత పెరుగుతోంది.
యూనివర్సిటీకి నకిలీ అక్రిడిటేషన్లు ఉన్నప్పటికీ, చట్టబద్ధమైన గుర్తింపు ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేసి, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సిద్ధిఖీ రూ.415.10 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ బ్లాస్ట్ కేసుతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ ఆరోపణలపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఆయన్ను ఆదివారం అరెస్ట్ చేసి, డిసెంబర్ 1 వరకు కస్టడీకి తీసుకుంది.
Read also: ముఖ సౌందర్యానికి ఈ సుగంధ ద్రవ్యాలను రాస్తున్నారా..?

భోపాల్‌లో కొత్త చీట్ ఫండ్ కేసు
జావేద్ అహ్మద్(Delhi blast) సిద్ధిఖీపై ప్రస్తుతం భోపాల్‌లో నమోదైన కొత్త కేసు 24 ఏళ్ల క్రితం నాటిది. 1997-2001 మధ్య కాలంలో సిద్ధిఖీ, అతని సోదరుడు హమూద్ సిద్ధిఖీ ఒక చిట్ ఫండ్ కంపెనీని నడిపి, డబ్బు రెట్టింపు చేస్తామని ప్రజల నుంచి భారీగా వసూలు చేసి మోసం చేశారని పోలీసులు తెలిపారు. గ్యాస్ బాధితులకు చెందిన నిధులను కూడా వారు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, దర్యాప్తు వేగవంతం కావడంతో మధ్యప్రదేశ్‌లోని మో కంటోన్మెంట్ బోర్డు అధికారులు సిద్ధిఖీ పూర్వీకుల ఇంటిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు సమయంలో యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్లు, ఫీజుల రికార్డులను సిద్ధిఖీ మార్చే అవకాశం ఉందని ఈడీ న్యాయస్థానంలో వాదించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: