हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Keerthy Suresh: AI మార్ఫింగ్ చిత్రాలపై కీర్తి సురేష్ ఆవేదన

Anusha
Latest News: Keerthy Suresh: AI మార్ఫింగ్ చిత్రాలపై కీర్తి సురేష్ ఆవేదన

ఇటీవలి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. ఈ టెక్నాలజీ వల్ల దుర్వినియోగాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా AI ఆధారిత మార్ఫింగ్, డీప్ ఫేక్ ఇమేజ్‌లు, నకిలీ వీడియోలు పెరిగిపోవడంతో సినీ నటీనటులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also: Movie Ticket: ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!

తాజాగా తన పేరుతో ఆన్‌లైన్‌లో సర్కులేట్ అవుతున్న AI మార్ఫింగ్ చిత్రాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అగ్ర క‌థానాయిక కీర్తి సురేష్ (Keerthy Suresh). డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన ఈ నకిలీ ఫోటోలు తనను మానసికంగా బాధిస్తున్నాయని కీర్తి తెలిపింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్టింది.“AI మార్ఫింగ్ చిత్రాలు నా మనసుకి చాలా బాధ కలిగించ‌డ‌మే కాకుండా.. చాలా విసుగు పుట్టిస్తున్నాయి.

ఈ కృత్రిమ మేధస్సుతో క్రియేట్‌ నకిలీ చిత్రాలు ఎంత న‌మ్మేలా ఉన్నాయంటే వాటిని చూసినప్పుడు నిజంగానే నేను అలా ఫోజు ఇచ్చానా? అని తనకు తాను ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని కీర్తి (Keerthy Suresh) పేర్కొన్నారు. ఇది AI సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేస్తుందని కీర్తి తెలిపారు.

Keerthy Suresh's concerns over AI morphing images
Keerthy Suresh’s concerns over AI morphing images

దుర్వినియోగంపై చర్యలు అవసరం

AI సాంకేతికత సామర్థ్యాలు నానాటికీ పెరుగుతున్నాయని వీటిని నియంత్రించడం కష్టంగా మారుతోందని కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా తమ ఇమేజ్‌లను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన‌ ఉందని.

ఈ సమస్య కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదని సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉండే ఎవరికైనా ఇది ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని కీర్తి హెచ్చరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870