కొన్ని రోజుల క్రితం తాను సైతం ఆరోపణలు ఎదుర్కొన్న సెక్స్ కుంభకోణం ఎపిస్టీన్ ఫైల్స్ కు (Epstein Files) సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫైల్స్ ను విడుదల చేసే బిల్లుపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ (Trump) స్వయంగా తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో డెమోక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు. నిందితుడు జెఫ్రీతో డెమొక్రాట్లకు ఉన్న సంబంధాల గురించి నిజాలు బయటపడాలనే ఉద్దేశంతోనే తాను ఆ ఫైల్స్ విడుదల చేసే బిల్లుపై సంతకం చేశానని చెప్పుకొచ్చారు.
Read Also: AP: ధాన్యం సేకరించిన గంటలలోనే రైతుల ఖాతాలో సొమ్ము
రిపబ్లికన్ల విజయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డెమోక్రాట్లు ఎపిస్టీన్ పైల్స్ ను బయటకు తీసుకువచ్చారని..తమకంటే దానితో వారే ఎక్కువ ప్రభావితం అవుతారని ట్రంప్ అన్నారు. దానిని వారు తమపై ఆయుధంగా ప్రయోగించాలనుకున్నారు కానీ ఇప్పుడు అది డెమోక్రాట్ల నిజాలనే బయటపెడుతుందని చెప్పుకొచ్చారు.

నెనేట్ లో అందరి ఆమోదం
ఎన్ ఫైల్స్ (N files) ట్రాన్స్యరెన్సీ యాక్ట్’ అని ఈ బిల్లుకు పేరు పెట్టారు. ఈ పైళ్ల విడుదలను తాను వ్యక్తిగతంగా సాధించిన పారదర్శకత విజయంగా ట్రంప్ చెప్పుకున్నారు. ఈ పైళ్ల విడుదలపై నిన్న అమెరికా (USA) ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టగా 427-1ఓట్లతో దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత సెనేట్ లో కూడా ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీని తరువాతనే ట్రంప్ ఫైళ్ల విడుదల చేసే బిల్లుపై సంతకం చేశారు. ఇప్పుడు న్యాయశాఖ ఎప్టాన్ కు సంబంధించి అన్ని పైళ్లతో పాటు 2019లో జైలులో అతడి మరణంపై దర్యాప్తు గురించిన సమాచారాన్ని 30 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే దీనిలో బాధితుల వివరాలు, దర్యాప్తు వివరాలు మాత్రం బయటపడకుండా జాగ్రత్తపడనున్నారు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: