దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన మహాకావ్యం బాహుబలి రీరిలీజ్ అయినా కూడా అదే జోష్‌తో బాక్సాఫీస్‌ను ఊపేసింది. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’(Baahubali The Epic) పేరుతో ఇటీవల మళ్లీ విడుదల చేసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ. 53 కోట్లు వసూలు చేస్తూ మరోసారి తన దర్పాన్ని చాటింది. రీరిలీజ్ అయిన సినిమా ఇంత భారీ కలెక్షన్లు సాధించడం అరుదైన ఘనతగా సినిమా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Sridhar Babu: స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ

వసూళ్లను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే
తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 23 కోట్లు రాబట్టింది.
కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిపి రూ. 9.8 కోట్లు,
హిందీ వెర్షన్ ద్వారా రూ. 8.45 కోట్లు వసూలైంది.
అదే విధంగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా దాదాపు రూ. 12 కోట్లు గ్రాస్ సంపాదించింది.
తాజా విడుదలైన కొత్త చిత్రాలను సైతం వెనక్కు నెట్టి బాహుబలి(Baahubali The Epic) ఇలా భారీ కలెక్షన్లు సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. రాజమౌళి(Rajamouli) విజన్, ప్రభాస్ అభిమాన శక్తి, ఈ చిత్రానికి ఉన్న అపారమైన క్రేజ్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద రుజువైంది. మొత్తానికి, బాహుబలి రీరిలీజ్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ చిత్రంగా మరో మైలురాయిని అందుకుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: