సచివాలయం: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు కూడా బాధ్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ వక్రీకరించి ఫేక్ ప్రచారం చేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవ చేశారు. “గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా” విశాఖ పరిరక్షణకు ఎవరేం చేశారని ముఖ్యమంత్రి చెప్పడాన్ని జీర్ణించుకోలేక వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తు కార్మికులను రెచ్చగొడుతుందని ఆయన విమర్శించారు. వైసీపీ 5ఏళ్ళ పాలనలో విశాఖ ఉక్కు కొని తుక్కు కింద పోస్కోకి అమ్మేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన సంగతి మరచి కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు మాట్లాడడం సిగ్గు అనిపించడం లేదాని మంత్రి సుభాష్ వైసీపీ నాయకులను ప్రశ్నించారు.
Read also: Srikalahasti: శివనామస్మరణతో హోరెత్తిన శ్రీకాళహస్తీశ్వరాలయం

YSRC’s fake campaign on Visakhapatnam Steel: Minister Subhash
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Visakhapatnam Steel Plant) స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్రంతో ప్రకటన చేయించడమే కాక ప్లాంట్ పరిరక్షణకు 12 వేల కోట్ల ప్యాకేజి సాధించిన విషయం గుర్తు చేసుకోవాలని వైసీపీకి సూచించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో 2600 కోట్లు ఇచ్చిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రజాధనం వృధా కాకుండా కార్మికులందరూ బాధ్యతగా పనిచేయాలని సిఎం చంద్రబాబు చెప్తే దాన్ని వక్రీకరించి జగన్ అండ్ కో ఫేక్ ప్రచారం చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఆక్షేపించారు. వైసీపీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 20శాతం కాగా నేటి కూటమి ప్రభుత్వంలో అది 79 శాతానికి పెరిగిందని కార్మికశాఖ మంత్రి వెల్లడించారు.
చంద్రబాబు వ్యాఖ్యాలను వక్రీకరిస్తున్నారంటూ
అప్పట్లో ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేయగా ఇప్పుడు మూడు పని చేస్తున్నాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చి లాభాల బాట పట్టించి ఉద్యోగులు కార్మికులకు అండగా నిలిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడే రాజకీయ అజ్ఞానులు, మంద బుద్దిగల వారే చంద్రబాబు వ్యాఖ్యాలను వక్రీకరిస్తున్నారంటూ ఆయన వైసీపీపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే సంస్థలకైనా, వ్యక్తులకైనా మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు చెప్పడం తప్పు ఎలా అవుతుందో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ డిమాండ్ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: