హైదరాబాద్: తెలంగాణలోని పత్తి రైతులు (Cotton farmers) ఎవరూ దిగులు చెందరాదని, మార్చి వరకూ మొత్తం పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Corporation of India) (సీసీఐ) కొనుగోలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు భరోసా ఇచ్చారు. పత్తి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన రైతులను కోరారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విమర్శలను దుయ్యబట్టారు.
Read also : US Congress news : అమెరికా కాంగ్రెస్ ఎప్స్టీన్ ఫైళ్ల విడుదలకు ఆమోదం…

కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలపై విమర్శలు
రాంచందర్ రావు (Ramchandra Rao) మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రైతుబంధును బంద్ చేసి, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు. రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురవుతున్నారని, నల్గొండ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమని అన్నారు. మరోవైపు, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను బేడీలు వేసి జైలుకు పంపించిన ఘన చరిత్ర ఆ పార్టీకి ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
సీసీఐ ద్వారా పూర్తి కొనుగోలు హామీ
పత్తి రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. పత్తి దిగుబడి ఎంత వచ్చినా సీసీఐ కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చొరవతో సీసీఐ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, జిన్నింగ్ మిల్స్, ఎంఎస్పీ అమలుకు అన్ని చర్యలు చేపట్టారని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు వందలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా ఉండేందుకు, రద్దీ, గందరగోళం లేకుండా చేసేందుకు కేంద్రం తీసుకువచ్చిన ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన రైతులను కోరారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :