ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ప్రత్యేక సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వచ్చింది. దీంతో ఉదయం నుంచే ఆయన ప్రయాణానికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది.
Read Also: Vennupotu : రైతులకు బాబు వెన్నుపోటు – వైసీపీ

తాడేపల్లి నుంచి హైదరాబాదు కు ప్రయాణం
కాసేపటి క్రితమే జగన్ (YS Jagan) తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, బలమైన భద్రతా ఏర్పాట్ల మధ్య విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.అక్కడి నుంచి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి ఆయన నేరుగా కోర్టుకు వెళతారు.
అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఆయన విచారణకు వచ్చారు. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జగన్ ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడం గమనార్హం. జగన్ చివరిసారిగా 2020 జనవరి 10న ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ మొత్తం 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. జగన్ రాక నేపథ్యంలో పోలీసులు నాంపల్లి కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: