దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తాజా చిత్రం ‘వారణాసి’ (వర్కింగ్ టైటిల్ రుద్ర) టైటిల్ రివీల్ ఈవెంట్‌ను ‘నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్’ అనేలా భారీ స్థాయిలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ వీడియో విపరీతంగా చర్చకు దారితీసింది. అయితే, ఈ వేడుకలో హనుమంతుని గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. సామాన్య ప్రజలతో పాటు, పలువురు రాజకీయ నాయకులు, హిందుత్వ వాదులు రాజమౌళిపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. తన సినిమాల కోసం దేవుడిని వాడుకుంటూ, ఆయనపై విమర్శలు చేయడం తగదని ట్రోల్ చేశారు. ఈ వివాదంపై స్పందించిన నటుడు ‘హైపర్’ ఆది, రాజమౌళికి గట్టిగా మద్దతుగా నిలిచారు.

‘హైపర్’ ఆది ‘ప్రేమంటే’ సినిమా వేడుకలో మాట్లాడుతూ, రాజమౌళి ఉద్దేశాన్ని అందరూ సరిగా అర్థం చేసుకోవాలని కోరారు. “ఆ రోజు (గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరిగిన రోజు) ఆయన హనుమంతుడి మీద అలిగారు తప్ప అవమానించలేదు. ఈ ఒక్కటీ అందరూ గుర్తించాలి” అని ఆయన స్పష్టం చేశారు. అంటే, రాజమౌళి ఉద్దేశం దేవుడిని కించపరచడం కాదని, ఒక భక్తుడి భావోద్వేగాన్ని మాత్రమే వ్యక్తం చేశారని ఆది సమర్థించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సన్నబడితే, బాలకృష్ణ మాట్లాడితే, అల్లు అర్జున్ నవ్వితే, చివరికి సాయి దుర్గా తేజ్ యాక్సిడెంట్ తర్వాత మాట్లాడటానికి ఇబ్బంది పడితే కూడా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News: AP Politics: చంద్రబాబు–పవన్–లోకేశ్ ఫ్లైట్ ట్రావెల్స్‌పై వివాదం
ట్రోలింగ్ సంస్కృతి ఏ స్థాయికి చేరిందో వివరించడానికి హైపర్ ఆది పలు ఉదాహరణలను ఇచ్చారు. “ప్రపంచ దేశాలకు వెళ్లి ‘బాహుబలి’ అంటే మీరు ఇండియనా అని గుర్తు పట్టేలా చేసిన ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోలింగ్. రామ్ చరణ్ గారి ‘చికిరి చికిరి’ పాట మీద పక్క దేశాల్లో రీల్స్ చేస్తుంటే, ఇక్కడ ట్రోలింగ్. విజయ్ దేవరకొండ గారిపై మన ఇండస్ట్రీ వ్యక్తులే ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారిపై డీప్ ఫేక్ వీడియో చేశారు” అని ఆది ఈ దుస్థితిని ఎత్తి చూపారు. ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలు ఒక వర్గానికి స్ఫూర్తినిస్తే, ఆ హీరోకు (విజయ్ దేవరకొండ) మళ్లీ పుంజుకునే అవకాశం లేకుండా ట్రోల్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై వ్యక్తిగత విమర్శలు, ట్రోలింగ్లు మానుకోవాలని, ఇది సమాజానికి మంచిది కాదని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/