हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP: ఎండిఎంఏ కేసులో కీలక పరిణామం వైఎస్సార్సీ నేత కొండారెడ్డి ప్రమేయం?

Rajitha
News Telugu: AP: ఎండిఎంఏ కేసులో కీలక పరిణామం వైఎస్సార్సీ నేత కొండారెడ్డి ప్రమేయం?

విజయవాడ: ఎండీఎంఏ కేసులో అరెస్టు అయి నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న లోహిత్ యాదవ్ ను మాచవరం పోలీసులు విచారించినట్లు కీలక సమాచారం. వైఎస్సార్సీపీ నేత కొండారెడ్డి, మరికొంత మంది కలిసి తరచూ డ్రగ్స్, (Drugs) మత్తు పదార్థాలను తీసుకునే వాళ్లమని లోహిత్ వెల్లడించాడు అని పోలీసులు వర్గాల సమాచారం. దాదాపు 20 మంది వరకు విశాఖలో తరచూ కలుస్తుంటాం. దొరికితే ఎండీఎంఏతో పార్టీ చేసుకుంటాం. లేని పక్షంలో గంజాయి, మద్యం తీసు కుంటాం అని, బెంగళూరు నుంచి మధుసూదన్ అలియాస్ మ్యాడీ నుంచి డ్రగ్స్ ని తెప్పించుకునే వారమని చెప్పాడు. తన పుట్టిన రోజు వేడుకలో డ్రగ్స్ ను వినియోగించేందుకే బెంగళూరు నుంచి శ్రీవాత్సవ్, హవీలా ద్వారా తెప్పించుకుంటుండగా వారు విజయవాడలో పోలీసులకు పట్టు బడ్డారని వివరించినట్లు కథనం. బెంగళూరులో ఉంటున్న మ్యాడీ ఎలా పరిచయం అయ్యాడని పోలీసులు లోహిత్ యాదవ్ ను ప్రశ్నించినప్పుడు తనకు సన్నీ, హరీష్ ద్వారా పరిచయం అయ్యాడని చెప్పాడు.

Read also: AP: జోగి రమేష్ పై మరిన్ని కేసులు!

Is the involvement of YSRC leader Kondareddy a key development in the MDMA case

Is the involvement of YSRC leader Kondareddy a key development in the MDMA case

డ్రగ్స్ సరఫరా చేసిన మ్యాడీని అరెస్టు చేయడంతో

నెల్లూరుకు చెందిన హరీష్ విశాఖపట్నంలో చదువుతున్నాడు. శ్రీవాత్సవ్ విశాఖ లో పరిచయమై స్నేహితుడిగా మారాడు. నెల్లూ రుకు చెందిన సన్నీకి హరీష్ గతంలో పరి చయం ఉందని విచారణలో చెప్పాడు. ఎండీఎం ఏను మ్యాడీ సరఫరా చేస్తుంటాడని సన్నీ ద్వారా హరీష్ తెలుసుకున్నాడు. ఇలా పలుసార్లు శ్రీవాత్సవ్ బెంగళూరు వెళ్లి ఎండీఎంఏ తీసుకొచ్చే వాడని సమాధానమిచ్చాడు. తాను విశాఖ నుంచే యూపీఐ ద్వారా మ్యాడీకి డబ్బులు బదిలీ చేసే వాడినని, తర్వాత బెంగళూరు నుంచి తెప్పించే వారమన్నాడు. గతంలో చాలాసార్లు తెప్పించా మని, తొలిసారిగా దొరికిపోయింది ఇప్పుడే అని విచారణలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇటీవల బెంగళూరులో పోలీసులు వీరికి డ్రగ్స్ సరఫరా చేసిన మ్యాడీని అరెస్టు చేయడంతో పలు కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మరింత లోతుగా విచారించేందుకు కోర్టు అనుమతితో లోహిత్ యాదవ్ ను ఉదయం నుంచి సాయంత్రం వరకు నెల్లూరు జైలులో పోలీసులు ప్రశ్నించారు.

18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ని

ఈ విచారణలో మరి కొన్ని కీలకమైన అంశాలను కూడా వెల్లడించినట్లు సమాచారం. మరికొందరి పాత్ర గురించి బయటకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈగల్ బృందం నిఘా పెట్టింది. ఈ క్రమంలో నగరంలోని మహానాడు జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టింది. బెంగళూరు నుంచి విశాఖ వెళ్తున్న బస్సులో శ్రీవాస్తవ, హవిలా అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ని ఈగల్ బృందం స్వాధీనం చేసుకున్నది, ఈ క్రమంలో విశాఖపట్నం నగర యువతీ, యువకులు బెంగళూరు నుంచి 19.1 గ్రాములు డ్రగ్స్ ని తరలిస్తుండగా దొరికారు. ముందస్తు సమాచారంతోనే వారిని పోలీసులు పట్టుకుంటున్నారు. ఆఫ్రికా నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థుల్లో కొందరు దీనిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఆర్థిక అవసరాలకు దీనిని సరఫరా చేస్తున్నారు. వీరు బాగా నమ్మకస్తులకే అందిస్తారు. ఫోన్ చేస్తే చాలు రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతున్నారు. నిఘా కళ్లుగప్పి తెస్తున్నారు. బస్సులు, రైళ్లలో విజయవాడకు తెస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870