Group 2 exam cancellation : తెలంగాణలో ప్రస్తుతం గ్రూప్–1 వివాదం కొనసాగుతుండగా, మరో పెద్ద నిర్ణయంతో గ్రూప్–2 అభ్యర్థులకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. 2015–16 సంవత్సరాల్లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం, పరీక్ష నిర్వహణలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను TGPSC ఉల్లంఘించింది అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. దీంతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఇది పిడుగులాంటి వార్తగా మారింది.
Read Also: Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన రాహుల్
O.M.R షీట్ ట్యాంపరింగ్ ఆరోపణలు
తమ ఓఎంఆర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందంటూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, దాదాపు పది సంవత్సరాల క్రితం జరిగిన ఈ పరీక్షలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని గుర్తించింది.
దీంతో 2015–16 గ్రూప్–2 పరీక్షను పూర్తిగా రద్దు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.
TGPSC పై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు
హైకోర్టులో న్యాయమూర్తి నగేష్ భీమపాక మాట్లాడుతూ—
- TGPSC కోర్టు ఆదేశాలను పాటించలేదని,
- తమ పరిధిని దాటి వ్యవహరించిందని,
తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు.
అంతేకాదు, పునర్మూల్యాంకనం జరిపించాలని,
తరువాత కొత్త అర్హుల జాబితా విడుదల చేయాలని TGPSCకి ఆదేశాలు ఇచ్చారు.
8 వారాల్లోగా పునర్మూల్యాంకనం పూర్తి చేయాలి (Group 2 exam cancellation) :
హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన గడువును కూడా నిర్ణయించింది.
TGPSC 8 వారాల లోపు
- పునర్మూల్యాంకనం పూర్తిచేయాలి
- కొత్త మెరిట్ లిస్ట్ ప్రకటించాలి
అని ఆదేశించింది.
పదేళ్ల క్రితమే ఉద్యోగాలు పొందిన వారికి ఆందోళన
2015–16లో జరిగాయి పరీక్షల్లో సెలెక్ట్ అయి, ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ తీర్పు టెన్షన్ కలిగించింది. (Group 2 exam cancellation) తమ భవిష్యత్ ఏమవుతుందన్న ఆందోళన ఇప్పుడు వారిలో కనిపిస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :