సజావుగా సాగుతున్న సినీ వినోద వ్యాపా రాన్ని అమాంతం మింగేసి సినీ జీవులకు బతుకు తెరువు లేకుండా చేయడమూ సమాజ విద్రోహంగానే భావించాలి. ఇప్పుడదే జరిగింది. ఓ చిన్న ముఠా అంతర్జాతీయ మోసానికి పాల్పడి పైరసీ భూతాన్ని సమాజం మీదకు వదిలిపెడితే దానికి బాలీ వుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సైతం చిత్రసీమ యావత్తూ 37 వేల కోట్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ భూతాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక గత కొన్ని సంవ త్సరాలుగా చిత్రసీమ విలవిల్లాడింది. ఇలా పైరసీని (piracy) ప్రైవసీ దారిలో నడిపించి దాదాపు 20 కోట్లు గడించిన దొంగ పోలీసులకు దొరికిపోయాడు. ఎన్ని కోట్లు ఆర్జించినా. ఆ నిందితుడు ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కించక తప్ప లేదు. విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి పోలీసుల చేత చిక్కాడు. తనకున్న సర్వర్లు ద్వారా 21వేల సిని మాలలో ఎవరికీ తెలియనీకుండా హ్యాకింగ్ చేయగలిగా ఉంటే జనం నివ్వెరపోయారు. ఎట్టకేలకు ఐబొమ్మ పైరసీకి తెరపడింది. అతి చిన్న వయసులోనే సినీ డిజిటల్ నేర సామ్రాజ్యాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని బొమ్మలాట ఆడించిన నింది తుడు చేతికి చిక్కాక సినీ నిర్మాతలు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. తన నెట్వర్క్ కొత్త సినిమా విడుదలైన కొన్నిగంటల్లోనే పైరసీ జరిగిపోతుం ది. తాను సొంతంగా ఒక్క సినిమాను కూడా హ్యాక్చేయ లేదు. రికార్డు చేయ లేదు. మూవీ రూల్జ్, తమిళ్ వన్ సహా మరికొన్ని పైరసీ (piracy) వెబ్సైట్ల నుంచి అప్లోడ్ అయిన సినిమాలనే హెచ్ఐ వెర్షన్లోకి రికార్డు చేసి నిమిషాల్లోనే సినీ ప్రేక్షకులకు అందించేవాడు. ఇవన్నీ రెండో కంటికి తెలియడనుకోవ డంలోనే దొరికిపోయాడు. ఎంత తెలి వైన నేరస్థుడేనా ఎక్కడో చిన్నతప్పుతో దొరికిపోతాడను కునే దానికి ఇదే నిదర్శనం. అందుకేనేమో ‘దమ్ముంటే నన్నుపట్టుకోండి!?’ అని పోలీసులకే సవాల్ విసిరాడు. కానీ ఓ బెట్టింగ్ యాప్ చేసిన చెల్లింపులు ఈతడిని పట్టే శాయి. శుక్రవారం హైదరాబాద్లో తన ఫ్లాట్లో ఉండగా పైరసీ మాస్టర్మైండ్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.3కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఎన్నో హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, పైరసీ కేసెట్లు స్వాధీ నం చేసుకున్నారు. ఒంటరిగా కరేబియన్ దీవు లలో నివసిస్తూ ఐ. బొమ్మకు అనుబంధంగా చాలా ప్రాక్సీ వెబ్సైట్లకు అనుసంధానం చేసి ఉచితంగా కొత్త సినిమాలు చూపించేవాడు. అలా నెమ్మదిగా వారి దృష్టిని బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించడం అతని హాబీ. ఒక్క తెలుగు చిత్రసీమకే సాలీనా దాదాపు 27వేల కోట్ల మేరకు నష్టం కలిగించిన ఈ పైరసీ వ్యవహారంలో ఎవరికీ- దొరక్కుండా ఐపి నంబర్లు, అవి ఉన్న లొకేషన్స్ ను మార్చి చూపడం లో అతనికి ఉన్న మేధాశక్తి అపూర్వం. అందుకే ఆరు నెలల పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడ కుండా దాక్కోగలిగాడు. నెలకు కనీసం 35 లక్షల మందికి పైగా ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కొత్త సినిమాలు వీక్షిస్తుం టారు. అతని నెట్వర్క్కు అతనే బాస్ అయినందున వెంటనే పట్టుకోలేకపోయారు. సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ కాపీని బయటకు వచ్చేసేది. అందుకు తగిన ఏర్పాట్లు, తమిళనాడులోని ఇద్దరి ద్వారా కథ నడి పించేవాడు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ పెద్దల ఫిర్యా దుతో పోలీసులు 89 వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు. ఇంతకు ముందు థియేటర్లలో సినిమాలు రికార్డు చేస్తూ సర్వర్లను హ్యాక్ చేస్తున్న ఐదుగురు కీలక నిందితులను ఆరెస్ట్ చేశారు. ఐబొమ్మ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉన్నదని, గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ ఐబొమ్మ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ఐబొమ్మలో బెట్టింగ్. యాప్ ల ప్రకటనల ద్వారా కూడా రవి కోట్లాది రూపాయలు సంపాదించినట్టు పోలీ సులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తులో కొన్ని అకౌంట్స్ వివరాలలో ఐబొమ్మతో జరిపిన లావాదేవీలు బయటపడ్డాయి. వీటి ఆధారంగా పోలీసులకు కూపీ లాగ గా ఐబొమ్మ గుట్టురట్టయింది. అతనికి ఐబొమ్మ, బప్పమ్, ఐవిన్ టీవీల పేర్లతో పైరసీకి పాల్పడుతుంటాయి. కరీబి యన్ దీవుల్లోని సెయింట్ నేవీ దేశపు పౌరసత్వం ఉంది. ఆ దేశమే ఈ వ్యవహారాన్ని నడపడంతో తన్నెవరూ కని పెట్టలేరని అనుకుని ఉంటాడు. అశ్వినీ కుమార్,కిరణ్ కుమార్ వంటి హ్యాకర్లకు తనకు బెట్టింగ్ యాప్ల నిర్వా హకులు ఇచ్చిన సొమ్ము నుంచి సినిమాకు 30వేలనుంచి లక్ష రూపాయల వరకు చెల్లించేవాడు. హ్యాక్ అయిన కం టెంట్ను నిమిషాల వ్యవధిలోనే తన వెబ్సైట్లకు అప్లోడ్ చేయగలగడం అతని నైపుణ్యం. అయితే సినీవర్గాలు తమ సినిమా పైరసీ కాకుండా హైలెవల్ సెక్యూరిటీ కోసం డిజిటల్ సర్వర్లలో భద్రపర్చుకుంటారు. కానీ ఆసర్వర్లను కూడా హాక్ చేయగల సత్తాఉంది. రవి కూడా ఒక సర్వ ర్నే నమ్ముకోకుండా మరో పది సర్వర్లను ముందు జాగ్రత్తగా నిర్వహించేవాడు. ఒకవేళ ఐబొమ్మ మూతపడితే ప్రత్యామ్నాయంగా వాడుకునేందు కు మరో 65 మిర్రర్ వెబ్సైట్లను సిద్ధం చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే దొంగ ఎప్పటికైనా దొరికి పోతాడన్న వాస్తవం తెలుపుతోంది. దేశంలో ఇతరప్రాంతా ల్లో కూడాఇలాంటి పైరసీ కార్యకలాపాలు ఉన్నాయి. వాటిని కూడా సమూలంగా నాశనం చేస్తే తప్ప పరిశ్రమ బతకదు. రవిని ఆరాతీయగా తనవద్దనున్న 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డాటాని కూడా డార్క్ వెబ్సైట్లకు అమ్ముకున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అయితేఅలాంటి సమాచారం చేరకూడని వారికి చేరితే నష్టం కలుగుతుం దని, పైరసీ సీనిమాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలను గమనంలోకి తీసుకోవాల్సిందే!
Read hindi news : hindi.vaartha.com
Epaper :epapervaartha.com
Read Also: