గదిలో సువాసన వచ్చేలా(Kitchen Tips) మార్కెట్ ఫ్రెషనర్లు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉన్న పదార్థాలతో సహజ పరిమళాన్ని సులభంగా పొందవచ్చు.
- ఒక చెంచా కాఫీ పొడి
- గుప్పెడు పుదీనా ఆకులు
- ఒక చెంచా బేకింగ్ సోడా
- నిమ్మ తొక్కలు
- కొద్దిగా నిమ్మరసం
ఈ అన్ని పదార్థాలను ఓ చిన్న గిన్నెలో వేసి గదిలోని ఏ మూలన ఉంచితే సహజమైన సువాసన వ్యాపిస్తుంది. ఈ మిశ్రమం గదిలోని దుర్వాసనను తగ్గించడమే కాకుండా ఎయిర్ ఫ్రెషెనర్లా పనిచేస్తుంది.

కిచెన్‌లోని గట్టు, టైల్స్, అద్దాల జిడ్డు తొలగించేందుకు సహజ ద్రావణం
కిచెన్‌లో(Kitchen Tips) రోజూ వంటకాలు చేస్తుండటంతో గట్టు, టైల్స్, కిటికీ అద్దాలపై జిడ్డు పేరుకుపోతుంది. దీనిని సహజంగా శుభ్రం చేయాలంటే ఈ హోమ్మేడ్ క్లీనర్ చాలా బాగా పనిచేస్తుంది.
అవసరమైనవి:
- పావు కప్పు వెనిగర్
- ఒక చెంచా బేకింగ్ సోడా
- రెండు కప్పుల నీరు
ఈ మిశ్రమాన్ని జిడ్డు ఉన్న ప్రదేశాల్లో స్ప్రే చేసి అరగంట తర్వాత తుడిచేస్తే వెంటనే శుభ్రంగా మారిపోతాయి. ఇది కెమికల్ ఫ్రీ పద్ధతి కావడంతో కిచెన్‌కు చాలా సేఫ్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: