భద్రాద్రి కొత్తగూడెం ప్రజల డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించింది. శిథిలావస్థలో ఉన్న పాత బస్టాండ్(New BusStand) స్థానంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు రూ.10 కోట్ల నిధులను డీఎంఎఫ్టీ కింద విడుదల చేస్తూ ఆమోదం తెలిపింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పాత బస్టాండ్ వానాకాలం రాగానే మరింత దారుణ స్థితికి చేరుకుంటుంది. పైకప్పుల లీకేజీలు, గుంతలతో నిండిన ప్రాంగణం, చెదిరిపోయిన గదులు – ఇలా ప్రతి రోజూ ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రద్దీ పెరగడంతో రోజుకు 25–29 వేలమంది ప్రయాణికులు ఈ బస్టాండ్‌ను వినియోగిస్తున్నారు. ఇందువల్ల ఆధునికీకరణ అవసరం అత్యవసరమైంది.
Read Also: TG Pre School: వారందరికీ 200 రోజుల పాటు ఫ్రీగా పాలు

సింగరేణి నుంచి నిధుల విడుదల – త్వరలో నిర్మాణానికి శ్రీకారం
సింగరేణి(Singareni) సీఎండీ ఎన్. బలరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు ప్రకటించిన తాజా వివరాల ప్రకారం, కొత్త బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన మొత్తం రూ.10 కోట్లు ఇప్పటికే ఆమోదించబడ్డాయి. పాల్వంచ బస్టాండ్ అభివృద్ధికి కూడా నిధులు సమీకరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన పాత బస్టాండ్(New BusStand) అభివృద్ధి ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ప్రస్తుతం చిన్న వర్షం పడినా డిపో మేనేజర్ ఆఫీస్ నుంచి గదుల పైకప్పుల వరకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. టాయిలెట్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది.
త్వరలో ప్రయాణికులకు ఆధునిక వసతులు
62 బస్సులు నిత్యం ఇక్కడి నుంచి నడుస్తున్నాయి. రోజువారీ రూ.13 లక్షల వరకు ఆదాయం వచ్చే ఈ డిపోలో పూర్తిస్థాయి సౌకర్యాలు అత్యవసరమని అధికారులు భావిస్తున్నారు. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యాక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: