Gajendra Singh Shekhawat: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విజయవాడ: లండన్ బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి శిల్ప (Amaravati marbles) సంపదని తెప్పిచ్చేదానికి కేంద్రం శరవేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ఢిల్లీలోని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నివాసంలో ఆయన కార్యాలయంలో కలిసి ఇటీవల భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పియూష్ శ్రీవాస్తవ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన లేఖ ను కేంద్ర మంత్రి కి అందజేస్తూ ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు.
Read also: Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు!

Steps to bring Amaravati’s sculptural treasures to the London Museum
అమరావతి అపురూప శిల్ప సంపద
Gajendra Singh Shekhawat: ఈ సందర్భంగా కేంద్రమంత్రిని తిరుమల శ్రీవారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రాచీన వారసత్వ కట్టడాలు అభివృద్ధికి లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి అపురూప శిల్ప సంపద గురించి చర్చించారు కేంద్ర విదేశాంగ శాఖ, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చెందిన అపురూప శిల్ప సంపదని భారతదేశానికి తీసుకువచ్చే దానికి శరవేగంగా చర్యలు తీసుకుంటున్నందుకు కేంద్రమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు ఢిల్లీలో డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ త్వరగా చర్యలు తీసుకొని కేంద్ర విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి అడిగిన వివరాలను పంపాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: