నాలుగుక్వారీలకు మాత్రమే అనుమతులు
పొడేరు, జి.మాడుగుల : అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) మన్యంలో అక్రమ క్వారీ తవ్వకాలు అధికమయ్యాయి. బినామీలు(Benami) పేరుతో క్వారీల అనుమతులు పొందుతూ గనులు భూగర్భ శాఖ అధికారులు నిబంధనలు మేరకు ఇచ్చిన అనుమతులను మించి మరీ మైనింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు పర్యావరణానికి ముప్పు కలిగిస్తూ.. మైనింగ్ అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ.. ఆక్రమంగా మైనింగ్ వేస్తూ ఖనిజ సంపదను కొల్లగొడు తున్నారు. మన్యంలోని జి.మాడుగుల మండ లం పరిధిలోని స్నిగర్భ పంచాయితీ జి. నిట్టా పుట్టులో అక్రమంగా నల్లరాయి తవ్వకాలు అధికమయ్యాయి. పెద్ద ఎత్తుబినామీలు ఆక్రమ క్వారీ తవ్వకాలు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ.. పర్యావరణానికి తూట్లు పొడిస్తున్నారు. కాగా.. ఏజెన్సీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గిరిజనులకు మాత్రమే క్వారీల లీజులు ఇవ్వాల్సి ఉంది. అయితే మైదానం ప్రాంతానికి చెందిన బదా మైనింగ్ దాన్లు గిరిజనేతరులు స్థానిక అమాయక గిరిజనులకు డబ్బులు ఎరగా చూపి గిరిజనుల పేర్లతో వివిధ మైనింగ్ క్వారీలను లీజుకు దక్కించుకొని కొట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఏజెన్సీలో ఏ క్వారీ లీజులను పరిశీలించినా లీజు స్థానిక గిరిజనుడుడైనా దాని వెనుక డబ్బులు పెట్టుబడులు అన్నీ బినామీలదే అనేది బహిరంగ రహస్యం. ఏజెన్సీలో నల్లరాయి క్వారీలు లీజుకు పొందిన బినామీలు అనుమతులకు మించి తవ్వకాలు విస్తరించి బ్లాస్టింగ్ లకు పాల్పడుతూ అటవీ శాఖ అధికారులను సైతం మైనింగ్ గ్యాంగ్ బురిడీ కొట్టిస్తున్నారు.
Read also: వైకుంఠ ద్వార దర్శనంలో స్థానికులకు అవకాశమిస్తారా?

మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం
ఏజెన్సీలో(Benami) రిజర్వు ఫారెస్ట్ భూముల్లో త్రవ్వకాలు జరుగుతున్నా మైనింగ్, ఆటవీ, రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో అధికారులు వినామీ దారులకు ఈ ఆక్రమ మైనింగ్కు వత్తాసు పలుకుతున్నారా? లేదా మైనింగ్ మాఫీయా వద్ద రాజీ పడుతున్నారా అంటూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అమాయక గిరిజనులను డబ్బులు ఎరగా వేసి వారి పేర్లతో గరులు భూగర్భ శాఖ (మైనింగ్ జియాలజీ శాఖ) నుంచి అనుమతులు పొందుతూ క్వారీ తవ్వకాలు చేపడుతూ అధికారులు ఇచ్చిన అనుమతులు కంటే అదనంగా అక్రమ తవ్వకాలు చేస్తూ పర్యావరణానికి ముప్పు వాటిస్తున్నారు. దీనికి ఉదాహరణగా జి.మాడుగుల మండలం స్నిగప్పంచాయితీ జి. నిష్ణాపుట్టు నల్లరాయి తవ్వకాలకు గిరిజనుడు పేరిట బినామీలు గనులు, భూగర్భ ఆదాల శాఖ (మైనింగ్, జువాలజీ) నుంచి లీజుకు పొందారు. దీంతో జి. నిట్టాపుట్టు నల్లరాయి క్వారీ తవ్వకాలు పెద్దఎత్తున బ్లాస్టింగ్ చేస్తూ యధేచ్చగా క్వారీ పనులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నల్లరాయి క్వారీ తవ్వకాలు వలన సుమారు వంద అడుగులు లోతుగా క్వారీ ఏర్పడటంతో వర్గాలు కారణంగా క్వారీలో నీరు నిల్వ ఉండి ప్రమాదకరంగా మారడంతో నీటిలో పశువులు పడి మృత్యువాత పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ క్వారీలో నల్లరాయి తవ్వకాలు కోసం పెద్ద ఎత్తున బ్లాస్టింగ్లు చేస్తుండటంతో చుట్టుప్రక్కల గిరిజనులు భయాందోళనకు గురవుతూ ఉంటున్నారు.
లీజులు కేవలం నాలుగు క్వారీలకు మాత్రమే
గతంలో ఈ క్వారీ కారణంగా వలు సమస్యలు ఎదుర్కొంటున్నామని క్వారీ నిలుపుదల చేసి రక్షణ కల్పించాలని కోరుతూ అప్పటి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్షి వరిసర ప్రాంత గిరిజనులు ఫిర్యాదు చేయగా క్వారీ తవ్వకాలు నిలుపుదల చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించగా అప్పట్లో స్వారీని అధికారులు నిలుపుదల చేసారు. మళ్ళీ చినామీలు పైరవీలు చేసి క్వారేని తెరిపించి యధేచ్చగా తవ్వకాలు, ప్లాస్టింగే స్తూ నల్లరాయి సేకరణ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా జి. నిట్టాపుట్టు క్వారికి సమీపంలో ఈదులబయలు రిజర్వు ఫారెస్ట్ ఆటవీ భూముల్లో సుమారు ఏడాదిన్నరగా అనధికారి కంగా ఆక్రమంగా నల్లరాయి తవ్వకాల జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తూ నల్లరాయిని బినామీలు సేకరిస్తున్నారు.. ఈ అనధికార ప్లాస్టింగ్ వలన చుట్టూ ప్రక్కల ఉన్న సింగర్భ పంచాయితీ చుట్టూ ప్రక్కల ఉన్న జి. సిద్దాపుట్టు, ఈదులబయలు, నేరేడువలస తదితర గిరిజన గ్రామాల గిరిజనులు రాత్రి పూట జరుగుతున్న బ్లాస్టింగ్ శబ్దాలతో భయాందోళనకు గురవుతున్నారు. బ్లాస్టింగ్ వలన ఎటునుంచి ఎటుగా ఏ రాయి వచ్చి ఇంటిమీద పడుతుందో.. ఎవరిపై పడుతుందోనని అనుక్షణం భయం గుప్పిట్లో బ్రతుకు తున్నారు. ఈ ప్లాస్టింగ్ వలన ఆయా ప్రాంతాల పంట పొలాలు, త్రాగునీటి వనరులు కలుషితంగా మారి ప్రజలు అనారోగ్యం పాలు, అవుతూ వ్యవసాయ భూములు రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొని ఉంది, క్వారీ చుట్టుప్రక్కల ఉన్న ఆయా గ్రామాల గిరిజనులు ఈ క్వారీలు మూసివేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్వారీ మూసివేసి న్యాయం చేయాలని గిరిజనుల కోరుతున్నారు.
క్వారీ తవ్వకాలు మా దృష్టికి రాలేదు.. మైనింగ్ జియాలజీ అధికారి ఏం. ఆనంద్
జిల్లాలో అనధికార క్వారీలు లేవని, తవ్వకాలు జరగటం లేదని, ఈదులబయలు విజర్వు ఫారెస్ట్ భూమిలో అనధికార క్వారీ తవ్వకాలు జరుగుతున్నట్టు మాదృష్టికి రాలేదని ఐతే ఆటవీ శాఖ దానిపై చర్యలు తీసుకోవలసి ఉంటుందని అల్లూరి జిల్లా మైనింగ్ జియాలజీ అధికారి (ఎఫ్ఎస్) ఏం ఆనంద్ వివరణ ఇచ్చారు. క్వారీల లీజులు గ్రామ సభ ఆమోదం ఉంటేనే
తవ్వకాలకు అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. ఈదులబయలు క్వారీ. తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని జిల్లా మైనింగ్ అధికారి పేర్కొన్నారు. అయితే ఈ క్వారీపై ఎటువంటి ఫిర్యాదులు కూడా రాలేదన్నారు. పాడేరు ఏజెన్సీలో ప్రస్తుతం నాలుగు క్వారీలు జి నిట్టావుట్టు, దేవపాలెం, కొట్నాపల్లి, మఠం క్వారీలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని ఆనంద్ స్పష్టం. చేసారు. ప్రతి క్యారీకి 10 సంవత్సరాలు లీజు పొంది ఉంటుందన్నారు. అల్లూరి జిల్లాలో సుమారు 50 క్వారీలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం జిల్లాలో 15 క్వారీలు మాత్రమే రన్నింగ్స్లో ఉన్నాయని మిగిలిన క్వారీలు స్థానికులు వ్యతిరేకత, స్థానిక సమస్యలు, కొన్ని రెన్యువల్ లేని కారణంగా క్వారీలు మూసివేసి ఆగిపోయి ఉన్నాయని జిల్లా మైనింగ్ అధికారి ఆనంద్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సుమారు. ఏడాదిన్నర నుంచి ఈదులబయలులో క్వారీ తవ్వకాలు అనధికారికంగా జరుగుతున్నా మైనింగ్ అధికారుల దృష్టికి వెళ్లకపోవడం గమనార్హం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: