తెలుగు సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగిస్తున్న ‘ఐబొమ్మ’(Ibomma) వంటి పైరసీ వెబ్‌సైట్లను నడిపించిన రవి ఇమ్మడి ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ పోలీసులకు సవాల్ విసిరిన అతడు చివరకు పట్టుబడి, విచారణలో అనేక కీలక విషయాలను బయటపెట్టాడు. పోలీసుల సమాచారం ప్రకారం, వెబ్ డిజైనర్‌గా పనిచేసిన రవి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, తక్కువ సంపాదన కారణంగా భార్య, అత్త తరచూ అవమానించడం వల్ల అతడు తీవ్రంగా బాధపడ్డాడు. ఈ పరిస్థితులు అతడిని త్వరగా డబ్బు సంపాదించాలనే ఒత్తిడికి గురి చేశాయి. తన కంప్యూటర్ నైపుణ్యాలను ఉపయోగించి ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ వంటి పైరసీ సైట్లను రూపొందించాడు.
Read Also: Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట బాంబు కేసులో ఎన్‌ఐఏకి కీలక పురోగతి

అవమానాలు, ఆర్థిక ఒత్తిడే రవిని నేర ప్రపంచంలోకి నెట్టిన కారణాలు
ఈ వెబ్‌సైట్లు కొద్ది కాలంలోనే ప్రసిద్ధి పొందడంతో బెట్టింగ్ యాప్‌లు భారీగా ప్రకటనలు ఇచ్చాయి. దీని ద్వారా రవి భారీ ఆదాయం సంపాదించాడు. అయితే, వ్యక్తిగత జీవితం మాత్రం కుదురుకోలేదు. భార్య అతనితో ఉండడానికి నిరాకరించడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం రవి నెదర్లాండ్స్‌కు వెళ్లి అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగించాడు. ఇదే సమయంలో సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను(Ibomma) సైబర్ నేరగాళ్లకు(cyber crime) విక్రయించి దాదాపు రూ. 20 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశంతో కూకట్‌పల్లి ఫ్లాట్‌ను అమ్మడానికి హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు ఖచ్చితమైన సమాచారం ఆధారంగా అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, చట్టాన్ని సవాల్ చేసే ఎవరైనా తప్పించుకోలేరని హెచ్చరించారు. ఉచితంగా సినిమాలు అందిస్తున్నట్లు కనిపించే ఈ రకమైన సైట్ల వెనుక యూజర్ల సమాచారం దోపిడీ చేసే ప్రమాదం దాగి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: