వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్
విజయవాడ : గిరిజన(Satya Kumar) తెగలు స్వచ్ఛమైన మనస్సుకు, సంస్కృతికి వారసులని వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా సోళ్ల బొజ్జి రెడ్డి, సభ్యులు సోమవారం ఆర్ అండ్ బి బిల్డింగ్స్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక తుమ్మ లపల్లి కళా క్షేత్రంలో గిరిజన సంస్కృతీ, ఆచారాలతో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ అభినందన సభనిర్వహించారు. ఈ సభను ముఖ్య అతిధిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా భాధ్యతలు చేపట్టిన సోళ్ల బొజ్జిరెడ్డికి, కమిషన్ సభ్యులుగా భాధ్యతలు చేపట్టిన జీ. సునీత, కే. లక్ష్మి, కే.సాయిరాం, కే. మల్లేశ్వర రావు, వెంకటప్పలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తారని దృఢంగా విశ్వసిస్తున్నానన్నారు.
Read also: కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి పెరిగిన బడ్జెట్ కేటాయింపులు
షెడ్యూల్డు కులాలు(Satya Kumar) మరియు తెగల సంక్షేమానికి అన్ని విధాల చైర్మన్, సభ్యులు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన దుశ్చర్యలను, దుష్ట సంస్కృతిని గుర్తు చేసుకోవాలని అప్పుడే భవిష్యత్తులో అటువంటి దుశ్చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడుకునే అవకాశం కలుగుతుందన్నారు. షెడ్యూల్డు కులాలు, తెగలను, వెనుకబడిన తరగతుల వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ లపై ఉందన్నారు. దాదాపు 7 శాతం జనాభా కలిగిన ఎస్టీలకి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా ఎప్పుడూ ఎవరూ ఆలోచించలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1999లో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్రంలో స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పాయ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి షెడ్యూల్ కులాలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసారన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్, వికసిత భారత్ నిర్మాణంలో గిరిజనులు ముఖ్య భూమిక వహించాలనే సంకల్పంతో గిరిజనుల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు పెంచారన్నారు. 2013-14లో కేవలం రూ.4,200 కోట్లు బడ్జెట్ కేటాయింపులు ఉంటే 2025-26కి రూ.14,956 కోట్లు పెరిగిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, గృహాలు, మరుగుదొడ్లు, ఆస్పత్రుల నిర్మాణాలు చేయడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాన్ని పెంచి వారి పిల్లలకి ఉద్యోగ భవిష్యత్తు కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
యువత భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యలు
ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మాట్లాడుతూ తాను బొజ్జిరెడ్డి మంచి మిత్రులమని, ఒక రాజ్యాంగ బద్ద పదివిని బొజ్జి రెడ్డిని వరించడం సంతోషకరమైన విషయమన్నారు. షెడ్యూల్డ్ కులాల మరియు తెగల పరిరక్షణ, హక్కుల కోసం తాము ఎన్నో పోరాటాలు చేశామని, ఎస్సీ కమిషన్ మరియు ఎస్టీ కమిషన్ సమన్వయంతో వ్యవహరిస్తేనే ఆయా కులాలు మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సోళ్ల బొజ్జి రెడ్డికి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. షెడ్యూల్డ్ తెగల పరిరక్షణకు సోళ్ల బొజ్జిరెడ్డి నిరంతరం శ్రమిస్తూ ఉంటారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరైన వ్యక్తికి సరైన భాద్యతలు అప్పగించారన్నారు. శాసనసభసభ్యులు మిరియాల శిరీష మాట్లాడుతూ తామందరం ఇప్పటివరకు కూడా ఆదివాసీల అభివృద్ధి కోసం మాత్రమే కృషి చేస్తున్నామని ఇకపైన కూడా ఎస్టీ కమిషన్ సహాయ సహకారాలతో ఏజెన్సీ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేలా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. నూతన చైర్మన్ బాధ్యతలు చేపట్టిన బొజ్జి రెడ్డికి కమిషన్ సభ్యులకు శుభా కాంక్షలు తెలియచేసారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్, ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్న రాములు, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: