హైదరాబాద్ (జూబ్లీహిల్స్): HYD ట్రాన్స్‌జెండర్ల (Transgender) గ్రూపు మధ్య తలెత్తిన వివాదం బోరబండలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెట్రోల్ పోసుకుని చేపట్టిన ఆందోళనలో ఆకస్మాత్తుగా నిప్పు అంటుకోవడంతో ఏడుగురు ట్రాన్స్‌జెండర్లతో పాటు బోరబండ ఇన్‌స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. గాయపడిన వారిలో అఫ్సానా, హీనా, నవనీత సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Pakistan: మా యువకులు బాగా ఆడి భరత్ ను ఓడించారు:మొహసిన్ నాక్వి

గొడవ నేపథ్యం, ఆందోళన వివరాలు
బోరబండ (Borabanda) పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బోరబండలో నివసించే స్వప్న అనే ట్రాన్స్‌జెండర్ గ్యాంగ్‌కు, మరో ప్రాంతంలో నివసించే మోనాలిసా (Monalisa) గ్యాంగ్‌కు కొద్ది రోజుల క్రితం ఒక బర్త్‌డే వేడుకలో గొడవ జరిగింది. ఇదే విషయమై మాట్లాడేందుకు వెళ్లిన స్వప్న గ్యాంగ్ సభ్యులపై మోనాలిసా దాడికి పాల్పడింది. దీంతో మోనాలిసాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్వప్న వర్గానికి చెందిన దాదాపు 50 మందికి పైగా సోమవారం మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో బోరబండ బస్టాప్ వద్దకు చేరుకున్నారు. తొలుత కొందరు పెట్రోల్ పోసుకుని బైఠాయించి ఆందోళనకు దిగారు.
మంటలు, గాయపడిన సిబ్బంది
పోలీసులు దాదాపు గంటపాటు వారిని బతిమలాడి, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో, ట్రాన్స్‌జెండర్లు తమ ఆందోళన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరో పది మంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు పది మంది వరకు పెట్రోల్ పోసుకొని ఆందోళనను ఉధృతం చేశారు. మోనాలిసా ఫోటోలతో కూడిన ప్లెక్సీలను పట్టుకొని నిరసన తెలుపుతున్న సమయంలో, అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఒకరి నుంచి ఒకరికి అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇన్‌స్పెక్టర్ సురేందర్, ఒక మహిళా కానిస్టేబుల్‌కు కూడా మంటలు అంటుకుని స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన ట్రాన్స్‌జెండర్లను ప్రైవేటు మరియు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదనపు డీసీపీ గోవర్ధన్, ఏసీపీ మురళీకృష్ణ సహా ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: