సౌదీ అరేబియాలో భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే (Saudi Arabia accident) మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.ఈ రోడ్డు ప్రమాదం తెలంగాణలోని పలువురి కుటుంబాలను విషాదంలో ముంచేసింది.
Read Also: Jubilee hills election: ఆలస్యంగా ప్రకటించినందువల్లే ఓడిపోయాం: ఈటల

మాజిద్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ఘటన (Saudi Arabia accident) పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ సౌదీ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టూర్స్ & ట్రావెల్స్ వారు ఈ ఘటన ఎలా జరిగిందని దానిపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: