కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా స్వతం త్రంగా పనిచేసే అతికొద్ది సంస్థల్లో భారతీయ ఎన్నికల వ్యవస్థ ప్రధానమైనది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకై ఓటర్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్‌ని తయా రు చేసేది, వివిధ రాజకీయ పార్టీలకి గుర్తింపుని, రాజకీయ పార్టీలకి చిహ్నలని కేటాయించేది కేంద్ర ఎన్నికల సంస్థ. కాబట్టి ఐదు సంవత్సరాలకి ఒకసారి నూతనంగా ఏర్పాటు అయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వ్యవస్థపై పెత్త నం చూయించి వివిధ రాజకీయ పార్టీలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి అనుకూలంగా వ్యవహరించేలా వేటికి కూడా హక్కు ఎన్నికల వ్యవస్థ (Election Organization)పై ఉండదు. భారతదేశం అంటే స్వేచ్ఛ సమానత్వ సోదరభావ ప్రజస్వామ్య గణతంత్ర రాజ్యా దేశంగా ఉండడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ద్వారా అంబ్కేర్ ఎన్నికల వ్యవస్థకు చాలా పటిష్టమైన భద్రతను ఇస్తూ, స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. అందుకే కేంద్ర, రాష్ట్రాల్లో ఎంతటి బలమైన ప్రజాబలం ఉన్న నాయకులు ఉన్నప్పటికిని ఎన్నికల వ్యవస్థ (Election Organization)ని, వాటిని నడిపే అధికారులని ఆయా పార్టీలకి, ప్రభుత్వాలకి అనుకూ లంగా వ్యవహరించడానికి అవకాశం లేదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాడానికి భారత రాజ్యాంగం రూపంలో ఎన్నికల వ్యవ స్థకి అత్యున్నతమైన స్వేచ్ఛ స్వతంత్ర ఉన్నది. ఇది భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పడానికి నిదర్శ నం. కానీ గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వంలో బిజెపి అనుబంధ ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కేంద్ర ఎన్నికల వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అనేక సంద ర్భాల్లో అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష పార్టీ నాయకులు బలమైన ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారు.
Read Also : Bihar: 10వ సారి బీహార్ CM నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

రాహుల్ గాంధీ ఆరోపణలు
అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తూ హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాని ఎన్నికల వ్యవస్థని తమకి అనుకూలంగా మలుచుకొని హర్యానాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆధా రాలతో సహా ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే తాజా గా ఢిల్లీలో ప్రొజెక్టర్‌లో ఫోటో, వీడియోలు వేసి ఎన్నికల వ్యవస్థ లోపాలను వివరిస్తూ దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లు హర్యానాలో ఉన్నాయని చెప్తున్నారు. అందువల్లనే హర్యానాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అందుకు బలమైన ఆధారాలు చూపిస్తూ బ్రెజిల్ దేశానికి చెందిన మోడల్ పేరుపై వివిధ పేర్లతో హర్యానాలో 22 చోట్ల ఓటు హక్కు ఉండడం రాహుల్‌గాంధీ చేస్తున్న ఓట్ చోర్ విధానానికి బిజెపి పాల్పడుతున్నదని నమ్మక తప్పని పరిస్థితి నెలకొ న్నది. అంతేకాదు బ్రెజిల్ మోడల్ కూడా రాహుల్ గాంధీ చూయించిన ఆధారాలకు స్పందించి అవి తన గతంలోని మోడల్ ఫొటోస్ అని, ప్రస్తుతం భారతదేశంలో తాను వైరల్ అవ్వడం ఓటు హక్కు కూడా ఉండడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇది మన దేశంలోని ఎన్నికల వ్యవస్థలోని లోపాలకి నిదర్శనం కాదా, విదేశీయుల ముందు అత్యున్న త విలువలతో కూడిన భారత రాజ్యాంగాన్ని అవమానపర చడం కదా..! మరి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల వ్యవస్థ తప్పు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల వ్యవస్థ వ్యవహరించనప్పుడు స్వ తంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థపై తప్పుడు ఆరోపణ చేస్తూ ఎన్నికల వ్యవస్థనే అభాసుపాలు చేస్తున్నారని ఎన్నికల అధికారులు ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ పై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు.
స్వతంత్ర ప్రతిపత్తి
కేంద్ర ఎన్నికల సంఘం తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేకపోతున్నదంటే కేంద్ర ఎన్నికల వ్యవస్థ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నదా..? అనే విషయాన్ని మేధావులు, విద్యా వంతులు, సామాన్య ప్రజలు సైతం నమ్మక తప్పడం లేదు.! ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ఒక్క ఓటే నాయకుల గెలుపు, ఓటమిని నిర్ణయి స్తుంది. కాబట్టి భారతదేశమంటేనే ఒకే వ్యక్తి ఒకే ఓటు ఒకే విలువ అనే రాజ్యాంగ బద్ధమైన ఉన్నత విలువలతో కూడిన అంశం కాబట్టి ఒక్క ఓటు ఐన ముఖ్యమైనదనే విషయం జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా చూయిస్తూ, బిజెపి కేంద్ర ప్రభుత్వంఓటు దొంగతనానికి పాల్పడుతున్నదనే అంశంలో ఎన్డీఏ ప్రభు త్వంలో,మోడీ నేతృత్యంలో ఎలాంటి లోపాలు లేనప్పుడు కేంద్ర ఎన్నికల సంస్థని తమకి అనుకూలంగా కీలు బొమ్మ గా మార్చుకోవడం లేదని నిజం ఐతే, తప్పుడు ఆరోపణలు చేస్తూ భారతీయ ప్రజల ఓట్లని, ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరచేలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ పై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకో వడం లేదు! అంటే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నదని కేంద్ర ఎన్నికల వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉన్నదని ప్రధాని చెప్ప దలుచుకున్నారా? అంటే భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికల వ్యవస్థకి కల్పించిన స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదంటే భారత రాజ్యాంగాన్ని, 140 కోట్ల భారతీయ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమాన పరుస్తున్నట్లే కదా!

నైతిక విలువలతో వ్యవహరించాలి
భారతీయులు తమ విలువైన ఓటు హక్కుతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో లేని వ్యక్తులపై ఓట్లు చూయించి, ఒక వ్యక్తికే అనేక ప్రాంతాల్లో ఓట్లు చూయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే భారతీయ ప్రజల ఆలోచనకి వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు, ప్రజల ఇష్టాలకి గౌరవం లేనప్పుడు దేశ ప్రజలను, గొప్ప నైన రాజ్యాంగాన్ని పాలకులు ఇష్టానుసారం అగౌరపరుస్తు న్నట్లే కదా. అలాంటప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు ఎలా వర్ధిల్లాబడతాయి.! కాబట్టి అంతిమంగా ఇలాంటి అనేక సందేహాలకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్ని కల కమిషన్ అధికారులు నైతిక విలువలతో వ్యవహరించి 140 కోట్ల మంది భారతీయులకి వాస్తవాలతో కూడిన సమాధానం చెప్తూ, భారత సార్వభౌమాధికారాన్ని, భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని, కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఉండే స్వతంత్ర ప్రతిపత్తిని రక్షించి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవ సరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ పార్టీలకతీతంగా, కుల, మతాలకతీతంగా, ప్రాంతాలకు అతీ తంగా మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం గ్రహించాల్సిన చారిత్రక సత్యం.
-పుల్లెంల గణేష్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :