సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం
సౌదీ అరేబియాలో(Saudi Arabia) మక్కా నుండి మదీనాకు వెళ్తున్న బస్సు బదర్-మదీనా రోడ్డు ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌తో ఢీకొట్టబడిన ఘోర ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక కుటుంబానికి 7 మంది, మరో కుటుంబానికి 8 మంది బలయిపోయారు. ఈ రెండు కుటుంబాల నుంచి షోయబ్ అనే యువకుడు మాత్రమే మృత్యుకంటే బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
Read also: షేక్ హసీనాకు ట్రైబ్యునల్ కోర్టులో దోషి తీర్పు

హైదరాబాద్ బోరబొండ కుటుంబాల నష్టం
మృత్యువాత(Saudi Arabia) పడ్డవారిలో షోయబ్ తల్లి గౌసియా బేగం, తండ్రి మహమ్మద్ అబ్దుల్ కధీర్, తాత మహమ్మద్ మౌలానా, బంధువులు రహీమ్ ఉనిషా, రెహమత్ బీ, మహమ్మద్ మన్సూర్ ఉన్నారు. ముఫ్టీ ఆసిఫ్ ఉల్లా కుటుంబానికి చెందిన మహమ్మద్ అలీ, సేహనాధ్ బేగం, మస్తాన్, జకీయ బేగం, మహమ్మద్ సోయాబ్, పర్వీన్ బేగం, మొహమ్మద్ సోహెల్ కూడా మృతి చెందారు. వీరంతా హైదరాబాద్ బోరబొండ ప్రాంతానికి చెందినవారు. ఈ ఘోర ఘటనలో మొత్తం 18 మంది హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: