రోడ్డు పై నడుస్తూ వెళ్తున్న ఒక మహిళకు యాదృచ్ఛికంగా ఒక ఏటీఎం కార్డు(ATM Card) కనిపించింది. కార్డుతో పాటు పిన్ నంబర్ రాసి ఉన్న కాగితం కూడా ఉండటంతో, ఆమె నేరుగా ఏటీఎం సెంటర్‌కి వెళ్లి ₹50,000 నగదు విత్‌డ్రా చేసింది. తర్వాత అందులో కొంత మొత్తాన్ని బంగారం కొనడానికి ఖర్చు చేసి, మిగతా డబ్బును దాచుకుంది. అయితే ఈ సంఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమెను గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని వేలూరులో జరిగింది.
Read Also: ISRO Updates: గగనయాన్–చంద్రయాన్: ఇస్రో నూతన ప్రణాళికలు

పూర్తి వివరాల్లోకి వెళితే
చిత్తూరు జిల్లా గుడిపాలకు చెందిన ఇన్‌బకుమారి, తన కుమార్తె రేచల్‌తో కలిసి కళ్లజోడు కొనుగోలు చేసేందుకు వేలూరు వెళ్లింది. అనంతరం మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయానికి వెళ్లిన సమయంలో, ఆధార్ కార్డ్(Aadhar Card) జిరాక్స్ కోసం బయటకు వెళ్లిన ఇన్‌బకుమారి హ్యాండ్‌బ్యాగ్ నుంచి ఏటీఎం కార్డు జారిపోయింది. చాలా వెతికినా దొరకకపోవడంతో, కొత్త కార్డు(ATM Card) తీసుకోవాలనుకుని తిరిగి వెళ్లింది.
₹50,000 విత్‌డ్రా అయ్యిందని
కొద్ది సేపటికి ఆమె ఫోన్‌కు ₹50,000 విత్‌డ్రా అయ్యిందని అలర్ట్ వచ్చింది. వెంటనే ఇన్‌బకుమారి వేలూరు దక్షిణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, బ్యాంకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, రాజపాళ్యంకు చెందిన దేవి అనే మహిళ కార్డు ఉపయోగించి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు.
పోలీసులు దేవిని అదుపులోకి తీసుకుని విచారించగా, అలాగే డబ్బుతో ₹30,000 విలువైన బంగారు కమ్మలు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఆ ఆభరణాల్ని మరియు మిగిలిన నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, దేవిని న్యాయపరమైన చర్యలు తీసుకుంటూ జైలుకు తరలించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: