తెలుగు సినిమా పరిశ్రమకు సంవత్సరాలుగా తలనొప్పిగా మారిన పైరసీ ప్లాట్‌ఫారమ్ ‘ఐబొమ్మ’ (IBOMMA CLOSED)చివరికి తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం సైట్‌ను తెరవడానికి ప్రయత్నిస్తే, “మీరు మమ్మల్ని ఇటీవల విన్నా, లేక చాలాకాలంగా మద్దతుదారులైనా సరే… మీ దేశానికి మా సేవలు ఇక శాశ్వతంగా నిలిపివేయబడ్డాయి. దీనితో కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు” అనే సందేశం మాత్రమే కనిపిస్తోంది. ఇటీవల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Read Also: TG Crime: కులాంతర ప్రేమ వివాహం ఘోరం: అన్న హత్య

ఐబొమ్మ, బప్పం టీవీ
విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి, కరీబియన్ దీవుల్లో స్థిరపడి ఐబొమ్మ, బప్పం టీవీ వంటి అనేక పైరసీ సైట్లను నిర్వహిస్తున్నాడు. సినిమా రిలీజ్‌కు ముందు లేదా వెంటనే మాస్టర్ ప్రింట్లను దొంగిలించి అప్‌లోడ్ చేసి, పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నాడు. అయితే, భార్యతో విడాకుల విషయంలో భారత్‌కి వచ్చిన సమయంలో ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అతడిపై వేట మొదలుపెట్టారు. చివరకు కూకట్‌పల్లిలోని నివాసం వద్ద రవిని అరెస్ట్ చేశారు.
అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత, ఐబొమ్మ మరియు బప్పం టీవీ సైట్లను పూర్తిగా మూసివేయించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పైరసీ ద్వారా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్‌లో సుమారు రూ.3 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ చర్యలతో పాటు ఈ రెండు సైట్లు ప్రస్తుతం పూర్తిగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: