ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం భారీ మార్పులు చేపట్టింది. జట్టు హెడ్ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (Kumar Sangakkara) ను తిరిగి నియమించినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆయన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతల్లోనూ కొనసాగుతారు. సంగక్కర గతంలో 2021 నుంచి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా పనిచేశారు.
Read Also: Gautam Gambhir: గంభీర్ పై నెటిజన్లు ఫైర్

సంగక్కర మాట్లాడుతూ
ఆయన హయాంలో జట్టు ప్రదర్శన మెరుగైంది. 2022లో ఫైనల్ చేరిన జట్టు, 2024లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. తన పునర్ నియామకంపై సంగక్కర (Kumar Sangakkara) మాట్లాడుతూ, “ఈ ప్రతిభావంతులైన జట్టుతో మళ్లీ పనిచేయడం గౌరవంగా ఉంది. స్పష్టమైన లక్ష్యంతో ఆడే జట్టును నిర్మించడమే మా ధ్యేయం” అని తెలిపారు.
విక్రమ్ రాథోడ్‌ను లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా, షేన్ బాండ్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. సంగక్కర మార్గదర్శకత్వంలో కొత్త ఆటగాళ్లతో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: