ఆఫ్రికాలోని (Africa) కాంగోలో లక్షలాదిమందికి జీవనోపాధి గనిలో పనిచేయడమే. ఈ గనిలో పనిచేయడం ఎంతో ప్రమాదంతో కూడిన పని. ఎందుకంటే ఇక్కడ భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఉంటుంది. దీంతో తరచూ ఇక్కడ కార్మికులు ప్రమాదంలో మరణిస్తున్నారు.
తాజాగా రాగి గనిలో వంతెన కూలి 32మంది దుర్మరణం చెందారు. అయితే మృతుల సంఖ 70 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లువాలాబా ప్రావిన్స్ లోని కలాండో సైట్ లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ మైనింగ్ లో ఎందరో వందలమంది కార్మికులు (workers) పనిచేస్తుంటారు.
Read Also: Banjara: బంజారా డిమాండ్ల సాధన కోసం 19, 20వ తేదీల్లో చలో ఢిల్లీ

కాల్పుల శబ్దంతో భయపడ్డ కార్మికులు
ఇందులో కాల్పుల (firing) శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. దీంతో అది కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ (Mining) తెలిపింది. ఈ దేశంలో మైనింగ్ గని ముఖ్యమైన జీవనాధారం. సుమారు 2లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ఇంతమంది ఉపాధి పొందుతున్న ఈ గనిలో భద్రతా చర్యలు సరిగ్గా లేవు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనతో ఈ ప్రాంతమంతా విషాదంతో నిండికొని ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: