TG: హైదరాబాద్ : నాబార్డ్ ఆర్థిక సాయంతో ఏరోపోనిక్ పద్ధతిలో వనపర్తి జిల్లాల్లోని మోజర్ల ఉద్యాన కళాశాలలో చేపట్టిన ఏరోపోనిక్ పద్ధతిలో కుంకుమపువ్వు (SAFFRON) సాగు సత్ఫలితాలను ఇచ్చిందని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రయోగశాలలో ఈ పద్ధతిలో కుంకుమపువ్వు రావడం మొదలైందని ఒక ప్రకటనలో తెలిపారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణం లో గత రెండు నెలలుగా చేస్తున్న పరిశోధన లో కుంకుమ పువ్వులు వచ్చాయన్నారు. దీంతో రాష్ట్రంలో సైతం నియంత్రిత వాతావరణంలో కాశ్మీర్లో మాత్రమే పండే కుంకుమ పువ్వును ఇక్కడ పండించవచ్చని ఉద్యాన విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు నిరూపించారని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించే విధంగా వర్సిటీ పరిధిలో పరిశోధనలు చేపడుతున్నామన్నారు.
Read also: Tummala Nageswara Rao: నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల సమ్మె

TG: Saffron cultivation in the state.. Horticulture VC Rajireddy
సాఫ్రాన్ మోడల్ ల్యాబ్లు
TG: అందులో భాగంగా కాశ్మీర్లో చల్లని వాతావరణంలో పండే కుంకుమపువ్వును విశ్వవిద్యాలయం పరిధి కళాశాలలో పైలెట్ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ఈ నూతన టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ త్వరలోనే పరిచయం చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యాన పరిశోధన సంస్థలలో సాఫ్రాన్ మోడల్ ల్యాబ్లు ఏర్పాటు చేసి స్థానిక రైతులకు శిక్షణను ఇస్తామన్నారు. రైతుల ఆదాయం మెరుగు పరచాలని ఉద్దేశంతోనే నూతన పరిజ్ఞానాన్ని అందరికీ అందించే పథకాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం దిగుబడి, నాణ్యత బాగుందని, ఈ పంట లో దశలవారీగా మేము కృత్రిమంగా కల్పించిన వాతావరణ పరిస్థితులు, పండించే విధానం, తదితర వివరాలు ఎవరైనా కావాలనుకుంటే ఉచితంగా అందిస్తామని తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: