తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు ప్రభుత్వం అందించే ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. మొత్తం 61 లక్షల చీరల పంపిణీకి(Free sarees scheme) ప్రభుత్వం రూ. 318 కోట్ల బడ్జెట్ కేటాయించగా, దీని ద్వారా రాష్ట్ర చేనేత కార్మికులకు భారీ ఉపాధి లభించింది. ప్రస్తుతం దాదాపు 50 లక్షల చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరగా, మిగిలిన స్టాక్‌ను త్వరగా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుతున్నారు.
Read Also: DK Shivakumar: రాజీనామా వదంతులను ఖండించిన డీకే శివకుమార్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సంవత్సరం చేసిన ప్రకటన మేరకు, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా చీరలను అందించేందుకు ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో ఈ పథకాన్ని అమలు(Free sarees scheme) చేస్తోంది. ఈ చీరల తయారీని చేనేత–జౌళి శాఖ మార్చి నెల నుంచే చేపట్టింది. దీని వల్ల వేలాది చేనేత కార్మికులకు వరుస నెలలుగా ఉపాధి లభించినట్టు అధికారులు తెలిపారు.
జిల్లాలకు చీరల రవాణా దాదాపు పూర్తిస్థాయికి చేరువ
61 లక్షల చీరలలో 50 లక్షల చీరలు ఇప్పటికే జిల్లాలకు పంపబడగా, మిగిలినవి వారంలోపే అక్కడికి చేరుకోవచ్చు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు పంపిణీ చర్యల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
ఉచిత చీరల పంపిణీ ప్రారంభించేందుకు ప్రభుత్వం రెండు తేదీలను పరిశీలిస్తోంది:
- నవంబర్ 19 – ఇందిరా గాంధీ జయంతి
- డిసెంబర్ 7 – తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుదినోత్సవం
ఈ రెండు ముఖ్యమైన రోజుల్లో ఏదో ఒక తేదీన పంపిణీ మొదలయ్యే అవకాశముంది. అధికారికంగా తేదీ ప్రకటించగానే అన్ని జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. వచ్చే నెల మొదటి వారం నాటికి పంపిణీ ప్రారంభం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. 61 లక్షల ఎస్‌హెచ్‌జీ మహిళలకు లబ్ధి చేకూరనున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణాల వరకు మహిళల్లో ఆనందం నెలకొంది. ఒకవైపు ఉచిత చీరలు వారికి అందబోతుండగా, మరోవైపు చీరల తయారీ ద్వారా చేనేత రంగానికి కొత్త ఊపు వచ్చింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: