మొన్న రెండు, నిన్న మూడు బొమ్మలతో పరిశీలన
తాడిపత్రి : టిటిడి మాజీ (Crime) ఎవిఎస్వి సతీష్కుమార్ హత్యకేసు బండారాన్ని బొమ్మతో బయటపెట్టాలనే పోలీసుల ప్రయత్నం ఏ మేరకు ఫలించనుందోననే విషయం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం సతీష్ మృతి సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో ఈ కేసు దర్యాప్తుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. శనివారం రెండు బొమ్మలు ఒక రైలు.. ఆదివారం మూడు బొమ్మలు..ఒక రైలును వినియోగించిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా సతీష్ మృతిపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలని ప్రయత్నిస్తున్నారు. జిఆర్పి నుంచి కేసును బదిలీ చేసు కున్న తాడిపత్రి పోలీసులు ఆదివారం సంఘటనా స్థలంలో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ ను ప్రయోగించి ఘటన జరిగిన తీరును అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఎఎస్పీ రోహిత్కుమార్ చౌదరి నేతృత్వం లోని పోలీసు బృందం చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో మూడు బొమ్మలను ఉంచి వివిధ రకాలుగా ప్రయోగ పూర్వక చర్యలు చేపట్టారు.
సతీష్కుమార్ ఎత్తుకు, బరువుకు సమానంగా ఉండేలా మూడు బొమ్మలను తయారుచేసి నిలబడిన స్థితిలో తోస్తే ఎలా.. కూర్చున్న స్థితిలో ప్రమాదవ శాత్తు పడితే ఎలా.. ఆత్మహత్యకు పాల్పడితే ఎలా అనే విషయాలను బొమ్మల ద్వారా పరిశీలనాత్మకంగా ప్రయోగించి చూశారు. మొదటి బొమ్మను నిల్చోబెట్టి కిందకు పడవేయగా అది 61 అడుగుల దూరంలోనూ, రెండవ బొమ్మ నిలబడి ప్రమాదవశాత్తు కాలు జారేలా చేయగా అది 88 అడుగుల దూరంలోనూ, మూడవ బొమ్మ కూర్చొని జారి పడగా 46 అడుగుల దూరంలో పడిపోవడాన్ని పోలీసులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఈ కేసు విచారణలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. రైల్వే టిసి, ఇతర సిబ్బందిని విచారించిన పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో సీన్ రీకన్స్ట్రక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు.
Read also: రూమర్ల వార్తలను ఖండించిన త్రిష

లగేజి సంచి అనుమానం విచారణను చిక్కుల్లోకి నెడుతున్న మిస్టరీ
సతీష్కుమార్ అనుమానాస్పద మృతి (Crime) కేసులో ఆదివారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన ప్రయాణించిన రైలులో లభించిన లగేజి సంచిపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఆయన 29వ సీటు రిజర్వు చేసుకుంటే 11వ సీటులోకి సదరు లగేజి ఎలా వచ్చిందనే అంశం అనుమానాస్పదంగా మారింది. తిరుపతి ఆర్పీఎఫ్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు అప్పగించారని చెబుతున్న ఈ లగేజి బ్యాగును ఎవరు అప్పగించారనే అంశం కూడా సందిగ్ధంగా మారింది. ఆదివారం సుమారు 5 గంటల పాటు కొనసాగిన సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా కేసు దర్యాప్తు వేగవంతం కానుందని పోలీసు వర్గాలు తెలిపాయి. టిటిడి(TTD) పరకామణి కేసులో కీలక అధికారిగా ఉన్న పూర్వ ఎవిఎస్వి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు, సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తును పూర్తి చేసి దోషులను కోర్టుముందర పెట్టాలనే పట్టుదలతో ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. శవపరీక్ష నివేదిక రావాల్సి ఉండటం, సతీష్ చరవాణితో పాటు ఆయన భార్య చరవాణిని కూడా సాంకేతిక సాయంతో పరిశీలించిన వివరాలు బహిర్గతం కావాల్సి ఉండటంతో ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలేమని పోలీసులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: