ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ICBC) ప్రపంచ ఆర్థిక రంగంపై నేరుగా ప్రభావం చూపే మహా ఆర్థిక సంస్థ. సరికొత్త గణాంకాల ప్రకారం, ICBC మొత్తం ఆస్తుల విలువ 6.9 ట్రిలియన్ డాలర్లు (దాదాపు ₹612 లక్షల కోట్లు). ఈ సంఖ్యను చూసి ఆర్థిక నిపుణులే షాక్ అవుతున్నారు. 2012 నుండి ఇప్పటివరకు వరుసగా ప్రపంచంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఈ బ్యాంక్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అమెరికా, యూరప్ వంటి ఆర్థిక శక్తుల దేశాల బ్యాంకులు కూడా దీనిని అధిగమించలేకపోవడం ICBC యొక్క విస్తృత రంగ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి చాలు.
Read also: Panchayat Elections: TG స్థానిక ఎన్నికల తాజా పరిణామం

SBI తో పోలిస్తే ICBC ఎంత భారీదంటే…
భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆస్తులు కూడా చిన్నవి కావు. అయినా ICBCతో పోలిస్తే ఎస్బీఐ చాలా వెనుకబడిపోయింది.
- SBI మొత్తం ఆస్తులు: ₹67 లక్షల కోట్లు
- ICBC ఆస్తులు: ₹612 లక్షల కోట్లు
ఇది చూస్తే ICBC, SBI కంటే దాదాపు తొమ్మిది రెట్లు పెద్దది.
ప్రపంచస్థాయి పోటీలో ICBC ఎదురుగా నిలవగల బ్యాంకులు చాలా అరుదు.
ICBC ఎలా రూపుదిద్దుకుంది? చరిత్రలో ఒక్కసారి
చైనాలో ఆర్థిక సంస్కరణలు వేగంగా సాగుతున్న 1978–1983 మధ్య కాలంలో ఈ బ్యాంక్ ఆవిర్భవించింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాను పూర్తిగా కేంద్ర బ్యాంకుగా మార్చి, వాణిజ్య బ్యాంకింగ్ కార్యకలాపాలను వేరుచేసే నిర్ణయం తీసుకున్న తర్వాత, 1984 జనవరి 1న ICBC అధికారికంగా ప్రారంభమైంది. దేశీయ అవసరాలను మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని ICBC ఓ పెద్ద ఆర్థిక వేదికగా ఎదిగింది.
ప్రపంచవ్యాపిత ఉనికి: ICBC ఒక గ్లోబల్ ఫైనాన్స్ నెట్‌వర్క్
ICBC చైనాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బలమైన స్థిరపాటు సాధించింది.
- మొత్తం శాఖలు: సుమారు 16,456
- విదేశీ శాఖలు: 416
ఈ శాఖలు ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఓషియానియా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల్లో ఉన్నాయి.
ఇది హాంకాంగ్, సింగపూర్ స్టాక్ మార్కెట్లలో లిస్టయినా కూడా, ప్రధాన వాటాదారు చైనా ప్రభుత్వమే కావడం దీనికి మరింత స్థిరతను ఇస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: