శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala Temple) ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెరచుకోనుంది. దీంతో మండల–మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ అధికారికంగా ప్రారంభమవుతోంది. ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సన్నిధిలో ఆలయ తలుపులు తెరవబడతాయి. అనంతరం ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గర్భగుడిలో వెలిగించిన జ్యోతిని 18 మెట్లు వద్దకు తీసుకువెళ్లి పవిత్ర అగ్ని వెలిగించే సంప్రదాయం కూడా పూర్తవుతుంది.
Read also: Srinagar Blast: ఈ పూటకు వెళ్లొద్దని కూతురు అడ్డుకున్నా… పేలుడులో ప్రాణాలు కోల్పోయిన షఫీ

Sabarimala
రోజుకు సుమారు 70 వేల మందిని
ఆలయం ఆదివారం తెరచుకున్నప్పటికీ, భక్తులకు దర్శనం మాత్రం సోమవారం ఉదయం నుంచే ప్రారంభం అవుతుంది. కొత్త పూజారుల ఆచార కార్యక్రమాలు ముగిసిన తర్వాత మండల మకరవిళక్కు యాత్రా కాలం భక్తులకు అందుబాటులోకి వస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకే ప్రవేశం ఉంటుంది. రోజుకు సుమారు 70 వేల మందిని దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు.
బుకింగ్ సదుపాయాలు కూడా
పంబ, నీలక్కల్, ఎరుమేలి, చెంగన్నూరు మరియు వండి పెరియార్ ప్రాంతాల్లో స్పాట్ బుకింగ్ సదుపాయాలు కూడా లభిస్తాయి. ఈ సీజన్‌లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని ట్రావెన్ కోర్ దేవాస్వం బోర్డు ప్రకటించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: