బిగ్‌బాస్ తెలుగు సీజన్-9(Bigg Boss 9)లో కేవలం ఐదు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఫినాలే వారం తీసేస్తే నాలుగు వారాలు మాత్రమే ఉండటంతో, ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 11 మందిని చూసి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఖాయమని చాలా మంది ఊహించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ బిగ్‌బాస్ సింగిల్ ఎలిమినేషన్‌తో షాక్ ఇచ్చాడు.
నామినేషన్స్‌లో 10 మంది – ఎవరు సేఫ్, ఎవరు డేంజర్?

ఈ వారం(Bigg Boss 9) ఇమ్మానుయేల్‌కు హౌస్మేట్స్ ఇమ్యూనిటీ ఇవ్వడంతో అతను తప్ప మిగతా పది మందిని బిగ్‌బాస్ నేరుగా నామినేట్ చేశాడు. ఓటింగ్‌లో అత్యధిక సపోర్ట్ ఉన్న తనూజ, కళ్యాణ్, డీమాన్, సుమన్ శెట్టి తొలుత సేఫ్ జోన్‌కు వెళ్లారు.
తర్వాత సంజన, రీతూ, భరణి సేఫ్ అయినట్లు సమాచారం.
డేంజర్ జోన్లో గౌరవ్, నిఖిల్, దివ్య మాత్రమే మిగిలారు.
లీక్ ప్రకారం నిఖిల్ నాయర్ ఎలిమినేట్?
తాజా లీక్ ప్రకారం ఈ వారం ఇంటి నుంచి వెళ్లేది నిఖిల్ నాయర్ అని తెలుస్తోంది.
ఇది ప్రేక్షకులకు చిన్న షాకే. ఎందుకంటే:
- ఈ వారం టాస్కుల్లో నిఖిల్ అద్భుతంగా ఆడాడు
- బీబీ రాజ్యం టాస్క్‌లో కమాండర్‌గా నిలిచాడు
- దివ్యను ఓడించి కింగ్‌గా కూడా మారాడు
- కెప్టెన్సీ టాస్క్‌లో తనూజ, రీతూలతో గట్టి పోటీ ఇచ్చాడు
అయినా చివర్లో సంజన హ్యాండ్ ఇవ్వడంతో కెప్టెన్ అవ్వలేదు.
దివ్య ఘోర ఫెయిల్ అయిన వారం – కానీ ఎలా సేఫ్?
ఇదిలా ఉంటే దివ్య ఈ వారం పూర్తిగా డౌన్లోనే వెళ్లింది.
ఆటలోనూ గెలవలేదు, హౌస్‌మేట్స్‌తో ఘర్షణలు కూడా పెరిగాయి.
ప్రత్యేకంగా భరణి, సుమన్, ఇమ్మానుయేల్లను టార్చర్ చేయడం నెగటివిటీ తెచ్చింది. అయినా నిఖిల్ ఎలిమినేట్ అవ్వడం దివ్యను కాపాడేందుకే అనిపిస్తోంది.
పోల్స్ ఏమంటున్నాయి? – నిఖిల్ ఎక్కడా డేంజర్ కాదు
అన్‌ఆఫీషియల్ పోల్స్‌లో:
- దివ్య – 28% ఎలిమినేట్ అవుతుందని ఓట్లు
- గౌరవ్ – 21% ఎలిమినేట్ అవుతాడని అభిప్రాయం
- నిఖిల్ – కేవలం 10% మాత్రమే డేంజర్ జోన్లో
ఇక సోషల్ మీడియాలోని మిగతా పోల్స్‌లో కూడా నిఖిల్ బలమైన కంటెస్టెంట్‌గానే కనిపించాడు.
తనూజ సేవింగ్ పవర్ కారణంగా మారిన గేమ్?
ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.
ఈ వారంతో తనూజ వద్దని ఉన్న సేవింగ్ పవర్ ఎక్స్పైర్ అవుతుంది.
ఒకవేళ డేంజర్ జోన్లో దివ్య-నిఖిల్ ఇద్దరూ ఉన్నట్లయితే:
- ఓటింగ్ పరంగా నిఖిల్ సేఫ్
- దివ్య డేంజర్
- కానీ తనూజ దివ్యను సేవ్ చేయడానికి పవర్ వాడి ఉండవచ్చు
అలా నిఖిల్ ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: