ప్రపంచ విమానయాన దిగ్గజం బోయింగ్ సంస్థకు(Boeing Company) అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. 2019లో జరిగిన ఘోర ఇథియోపియన్ (Ethiopia) ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో మృతి చెందిన భారతీయ పౌరురాలు, ఐక్యరాజ్య సమితి కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ. 317 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఆరేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత శిఖా గార్గ్ కుటుంబానికి ఈ తీర్పు రూపంలో ఊరట లభించింది. బోయింగ్ సంస్థ విమాన రూపకల్పనలో లోపాలు ఉన్నాయని, అంతేకాకుండా ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడంలో విఫలం అయిందని ఆరోపిస్తూ శిఖా గార్గ్ కుటుంబం కోర్టులో దావా వేసింది.
Read Also: One Plus: వినియోగదారులకు గుడ్ న్యూస్ వన్ ప్లస్ 13 పై తగ్గింపు

150 మంది ప్రాణాలు కోల్పోన విషాద ఘటన
శిఖా గార్గ్ అప్పుడు ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు నైరోబికి వెళ్తున్నారు. పీ -హెచ్ డీ చేస్తున్న ఆమెకు భారతీయ సంస్కృతి, ముఖ్యంగా చీరకట్టు అంటే మక్కువ ఎక్కువని ఆమె కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు.
ఇథియోపియాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రమం నుంచి టెకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ బాధిత కుటుంబానికి భారీ ఊరట నిచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: